ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్నాహ్నం సమయ్ పూర్ బద్లిలోని ఓ ప్లాస్టిక్ ప్యాక్టరీలో అనుకోకుండా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీకి పక్కనే కరెంటు తీగలు ఆనుకుని ఉండటంతో..గాలికి తీగలు ఒకదానికొకటి తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని తెలిపారు ఫ్యాక్టరీ సిబ్బంది. ప్రాణనష్టం జరగనప్పటికీ భాగీగా ఆస్తినష్టం వాటిల్లిందని తెలిపారు ప్యాక్టరీ యజమాని. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి ఫైర్ ఇంజన్లతో వచ్చారు. ఫైర్ సిబ్బందితో మంటలను అదుపు చేసినట్లు తెలిపారు పోలీసులు.

Latest Updates