ఐపీఎల్ ఆడనివ్వం..మేం చెప్పే వరకు వెయిట్ చేయండి

కరోనా వైరస్ ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం హై  అలెర్ట్ ప్రకటించింది. భారీ బహిరంగ సభలు, సమావేశాలు ,క్రీడా సమావేశాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎల్ కు  భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. అందుకే గేమ్ లకు సంబంధించిన కార్యకలాపాలను నిషేదించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్కూళ్ళు, సినిమా హాల్స్, ఫంక్షన్ హాల్స్ , షాపింగ్ మాల్స్ మూసివేయాలని ఆదేశించిన ఢిల్లీ సర్కార్.. ఐపీఎల్ కూడా ఢిల్లీలో జరపబోమని ప్రభుత్వ నోటీసులు జారీ అయ్యే వరకు బ్యాన్ కొనసాగుతుందని తెలిపింది.

మెట్రోపై కరోనా ఎఫెక్ట్

కరోనా వైరస్ కారణంగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో అన్ని మెట్రో స్టేషన్లలో అధికారులు క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. జనాలు రద్దీగా ఉన్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు, సానిటైజేషన్ వాడాలని, గుంపులు గుంపులుగా తిరగ వద్దని మెట్రో అధికారులు సూచిస్తున్నారు.

Latest Updates