కొన్ని సర్వీసులకు అనుమతిచ్చిన ఢిల్లీ సర్కార్‌‌

న్యూఢిల్లీ: కరోనాను అరికట్టేందుకు మే 3 వరకు లాక్‌డౌన్‌ను పెంచిన ఢిల్లీ సర్కార్‌‌ తాజాగా కొన్ని సర్వీసులకు సడలింపులు ఇచ్చింది. ప్యాథలాజికల్‌ ల్యాబొరేటరీస్‌, బుక్‌ స్టోర్స్‌, ప్లంబింగ్‌ సర్వీసులకు అనుమతిస్తూ కేజ్రీవాల్‌ సర్కార్‌‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హెల్త్‌ వర్కర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, సైంటిస్టులు ఢిల్లీ పరిధిలో తిరగొచ్చని ఢిల్లీ డిజాస్టర్‌‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (డీడీఎంఏ) చెప్పింది.

ఓపెన్‌ అయ్యే సర్వీసులు ఇవే

  • హెల్‌ కేర్‌‌లో వెటర్నరీ హాస్పిటల్స్‌, డిస్పెన్సరీలు, క్లీనిక్‌లు, ప్యాథాలజీ ల్యాబొరేటరీలు, వ్యాక్సిన్స్‌, మెడిసిన్స్‌ సప్లై చేసే, సేల్‌ చేసే డిపార్ట్‌మెంట్స్‌.
  •  ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలకు ఇంటర్‌‌, ఇంట్రా స్టేట్‌ ట్రావెల్‌కు అనుమతి. అత్యవసర పరిస్థితుల్లో వాళ్లు బై ఎయిర్‌‌ కూడా వెళ్లే అవకాశం.
  • అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, షెల్టర్‌‌ హోమ్స్‌కు పర్మిషన్‌.
  • ఎలక్ట్రీషియన్స్‌, ప్లంబర్స్‌కు అనుమతి.
  • స్కూల్‌ బుక్స్‌, ఎడ్యుకేషన్‌కు సంబంధించి షాపులకు అనుమతి.

Latest Updates