ఢిల్లీలో షాపులు తెరుచుకోవు

  • ఈ నెల 27తర్వాత నిర్ణయం
  •  ప్రకటించిన అధికారులు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నుంచి దుకాణదారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్‌ ఢిల్లీలో అమలు కాదని అధికారులు చెప్పారు. దీనిపై ఈ నెల 27న నిర్ణయం తీసకుంటామని శనివారం ప్రకటించారు. మాల్స్‌ మినహా షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ యాక్ట్‌లో రిజిస్టర్‌‌ అయిన అన్ని షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. “ ప్రస్తుతం ఉన్న పరిస్థితి కారణంగా ఇంతకు ముందు విధించిన ఆంక్షలు కొనసాగుతాయి” అని ఢిల్లీ ప్రభుత్వంలోని సీనియర్‌‌ అధికారి ఒకరు చెప్పారు. ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ కింద రాష్ట్రాలు సొంత రూల్స్‌ విధించుకునే అధికారాలున్నాయి. లాక్‌డౌన్‌ నుంచి కేంద్రం ఇచ్చిన మినహాయింపులు రాష్ట్రాలు పాటించాల్సిన అవసరం లేదు.

Latest Updates