నిర్భయ నిందితుడి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన ప్రభుత్వం

నిర్భయ కేసులో నిందితుడైన ఓ వ్యక్తి తన కారుణ్య మరణానికి అంగీకరించాలంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇచ్చిన పిటిషన్ ఆ రాష్ట్ర సర్కార్ తిరస్కరించింది.  ఈ కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న దోషులలో ఒకరైన వినయ్ శర్మ  మెర్సీ కిల్లింగ్ (కారుణ్య మరణం)కై ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ముందు పిటిషన్ దాఖలు చేశారు.  ఆ పిటిషన్ ను పరిశీలించిన ఢిల్లీ హోం మంత్రి  సత్యేంద్ర జైన్.. ఆ పిటిషన్ ను తిరస్కరించాలని  ఢిల్లీ  లెఫ్టినెంట్ జనరల్ అనిల్ బైజల్ ను కోరారు.  పిటిషనర్ అత్యంత క్రూరంగా ఓ అమాయకురాలిని రేప్ చేసి చంపారని, అంత ఘోరమైన నేరాన్ని దృష్టిలో ఉంచుకుని పిటిషన్ ను పరిశీలించాలన్నారు.

MORE NEWS:

షీ టీమ్ నంబర్ ఇదే.. మన బిడ్డలకు చెప్పండి

రేప్ చేస్తే ఏ దేశంలో ఏ శిక్ష?

2012 డిసెంబర్ 16 న ఢిల్లీలో ఒక మెడికల్ స్టూడెంట్ ని కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపారు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్ర గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు డిసెంబర్ 29న తుదిశ్వాస విడిచింది. ఆ ఆరుగురు నిందితుల్లో వినయ్ శర్మ ఒకడు.

Delhi government recommends rejection of Nirbhaya case convict’s mercy plea

Latest Updates