ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ల గోల్ మాల్.. 12 రాష్ట్రాల్లో షార్టేజ్

ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ల  గోల్ మాల్.. 12 రాష్ట్రాల్లో షార్టేజ్

ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ల గోల్ మాల్ జరిగింది. కరోనా పీక్ టైంలో అవసరానికంటే నాలుగు రెట్లు ఎక్కువ చేసి చూపించింది ఢిల్లీ సర్కారు. 289 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరముంటే.... ఏకంగా 1140 మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉందని ఢిల్లీ ప్రభుత్వం చూపించినట్లు సుప్రీంకోర్టు ఆడిట్ లో తేలింది. ఢిల్లీ ఎక్కువ డిమాండ్ చూపి ఆక్సిజన్ తీసుకోవడంతో... 12 రాష్ట్రాల్లో షార్టేజ్ ఏర్పడిందని తెలిపింది ఆడిట్ కమిటీ. ఢిల్లీలోని 4 హాస్పిటళ్లు ఈ ఆక్సిజన్ గోల్ మాల్ లో ఇన్వాల్వ్ అయినట్లు చెప్పింది సుప్రీం కోర్టు. సింఘాల్ హాస్పిటల్, అరుణ ఆసిఫ్ అలీ హాస్పిటల్, ESIC మోడల్ హాస్పిటల్, లైఫ్ రే హాస్పిటళ్లు ఆక్సిజన్ వినియోగంలో తప్పుడు రిపోర్టులు ఇచ్చాయని వివరించింది.