సెప్టెంబ‌ర్ 20 వ‌ర‌కు స్కూల్స్ ప్రారంభించ‌డానికి వీల్లేదు

సెప్టెంబ‌ర్ 20వ‌ర‌కు స్కూల్స్ స్కూల్స్ లో క్లాసులు నిర్వ‌హించ‌డానికి  వీల్లేదంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్ప‌టి వ‌రకు ఆన్ లైన్ క్లాసులు నిర్వ‌హించాల‌ని సూచించింది.

అన్‌లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం క‌రోనా వైర‌స్ నుంచి సుర‌క్షితంగా ఉంచేందుకు దేశంలోని అన్నీ స్కూల్స్ మరియు విద్యాసంస్థలు సెప్టెంబర్ 30 వరకు బంద్ కొన‌సాగించేలా కేంద్రం ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఢిల్లీ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం స్కూల్స్ ప్రారంభం త‌రువాత 9 నుండి 12 తరగతుల విద్యార్థులు ఉపాధ్యాయులు స‌ల‌హాతో త‌ల్లిదండ్రుల అనుమ‌తితో కంటైన్మెంట్ జోన్ లేని స్కూల్స్ కి వెళ్ల వ‌చ్చ‌ని తెలిపింది.

కాగా సెప్టెంబర్ 21 నుండి 50% ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బందిని ఆన్‌లైన్ స్ట‌డీస్ మరియు ఇతర అవ‌స‌రాల కోసం సిబ్బందిని పిల‌వ‌నున్నారు.

Latest Updates