ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి పడేశాడు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ప్రియురాలిని చంపి… మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన జిమ్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రేయసితో పాటు క్యాబ్‌ డ్రైవర్‌ను కూడా కాల్చిచంపాడు.

ఢిల్లీలో లేటెస్ట్ టెక్నాలజీతో జిమ్ సెంటర్ ను ఏర్పాటు చేశాడు హేమంత్‌ లంబా అనే వ్యక్తి . దానికి అతనే కోచ్ గా పని చేస్తున్నాడు. అతనికి రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల  యువతి దీప్తి గోయల్ తో పరిచయం ఏర్పడింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో తన బంధువుల దగ్గర ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలోనే హేమంత్‌తో ప్రేమలో పడింది దీప్తి. ఈ క్రమంలో డిసెంబరు 7వ తేదీన హర్యానాలోని రేవారికి ఆ యువతిని తీసుకువెళ్లిన హేమంత్‌.. ఆమెపై కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశాడు.తర్వాత బాధితురాలి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి అక్కడే పడేశాడు. ఆ తర్వాత ఓ క్యాబ్‌ బుక్‌ చేసుకుని… తనను జైపూర్‌ తీసుకువెళ్లాల్సిందిగా డ్రైవర్‌ను కోరాడు. అయితే డ్రైవర్‌ ఇందుకు నిరాకరించడంతో.. అతడిని కూడా తుపాకీతో కాల్చి చంపాడు.

ఆ తర్వాత అదే కారులో గుజరాత్‌లోని వల్సాద్‌ ప్రాంతానికి పారిపోయాడు. అక్కడే కారును అమ్మేందుకు ప్రయత్నించగా.. కారు డీలర్‌కు హేమంత్‌ ప్రవర్తనపై అనుమానం కలిగింది. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో… క్యాబ్‌పై ఉన్న ఓ ఫోన్‌ నెంబరుకు కాల్‌ చేశాడు. దీంతో డ్రైవర్‌ భార్య ఫోన్‌ లిఫ్ట్‌ చేసింది. తన భర్త కనిపించడం లేదని అతడికి చెప్పింది. దీంతో  ఆ కారు డీలర్‌ పోలీసులకు సమాచారమివ్వగా.. అసలు విషయం బయటపడింది.

హేమంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైనశైలిలో విచారణ జరుపగా నేరాన్ని అంగీకరించాడు. రెండు హత్యా నేరాల కింద హేమంత్‌ను అరెస్టు చేశారు. అయితే.. ప్రియురాలిని హత్య చేయడానికి గల కారణాలు తెలియలేదు.

Latest Updates