బాబా రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

బాబా రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

యోగా గురు బాబా రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అల్లోపతి వైద్యం, డాక్టర్ల పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై సమన్లు జారీ చేసింది. కేసును కోర్టు వచ్చే నెల 10న విచారించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు అల్లోపతి ఔషధాలతో లక్షలాది మంది కరోనా పేషెంట్లు చనిపోయారని బాబా రాందేవ్ అన్నారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రతినిధులు ఆ వ్యాఖ్యలను తప్పుపట్టారు. పరువునష్టం నోటీసులిచ్చారు. క్షమాపణలు చెప్పకపోతే రూ.వెయ్యి కోట్లను రాందేవ్ నుంచి రాబడతామని హెచ్చరించారు. విషయంలో జోక్యం చేసుకున్న అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాల్సిందిగా రాందేవ్ కు సూచించారు. దీంతో రాందేవ్ ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. తర్వాత కూడా IMA పాట్నా, రాయ్ పూర్ సహా వివిధ ప్రాంతాల్లో రాందేవ్ పై కేసులు పెట్టింది.