ఉదయం భేటీ..సాయంత్రం బెయిల్

మనీ లాండరింగ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్ కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 లక్షల వ్యక్తిగత బాండ్ పై బెయిల్ ఇచ్చింది. గతంలో ఆయన బెయిల్ పిటిషన్ ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. మనీ లాండరింగ్ కేసులో ఆగస్టు   31న మొదటిసారి  డీకే శివకుమార్ ను ఈడీ అధికారులు  ప్రశ్నించారు. ఐదు రోజుల విచారణ తర్వాత  సెప్టెంబర్ 3న  అరెస్ట్ చేశారు. అప్పటినుంచి  తీహార్ జైలులో ఉన్నారు. ఇవాళ ఉదయం (బుధవారం) కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ జైల్లో ఉన్న శివ కుమార్ ను కలిసి పరామర్శించారు.

Latest Updates