పార్కింగ్ స్లిప్ అడిగాడని సెక్యూరిటీ గార్డును కొట్టారు

పార్కింగ్ స్లిప్ అడిగినందుకు ఓ సెక్యూరిటీ గార్డును నలుగురు వ్యక్తులు చితకబాదారు. ఢిల్లీ నగరంలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిందీ ఘటన. ఆసుపత్రికి ఓ వాహనంలో వచ్చిన నలుగురు వ్యక్తుల్ని.. పార్కింగ్ స్లిప్  చూపించాలని అడిగాడు ఆ సెక్యూరిటీ గార్డు. దీంతో ఆ నలుగురు వ్యక్తులు అతడిని కారణం లేకుండా కొట్టారు, కాళ్లతో తన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.  తీవ్రగాయాలైన ఆ గార్డు ప్రస్తుతం ఆ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ దాడికి పాల్పడ్డ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు.  అరెస్టయిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Latest Updates