సరిహద్దుల్లో టెర్రరిస్టులు చొరబడొచ్చు.. సెంట్రల్ ఏజెన్సీల హెచ్చరిక

న్యూఢిల్లీ: ఇండో–చైనా బార్డర్‌‌లో ఉద్రిక్తతలతోపాటు గత నెలలో నేపాల్‌ ఫైరింగ్‌కు పాల్పడటంతో మన దేశ సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని పెంచారు. బిహార్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్‌‌ రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సెంట్రల్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేయడంతో బార్డర్ ఏరియాస్‌లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. ఈ నెల 22న పైన పేర్కొన్న రాష్ట్రాలకు ఏజెన్సీలు మేజర్ అలర్ట్స్ జారీ చేశాయని తెలిసింది. తాలిబన్, జైష్ టెర్రరిస్టుల సాయంతో ఇండియాలో పెద్ద టెర్రర్ అటాక్ కోసం పాకిస్తాన్ ఐఎస్‌ఐ ప్లాన్ చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. వారి ముఖ్య లక్ష్యం ఢిల్లీ అని, అలాగే దేశ రాజధానిలోని కీలక రాజకీయ నేతలనూ టార్గెట్‌గా చేసుకున్నారని సమాచారం. జమ్మూ కాశ్మీర్‌‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్‌ గుండా చొరబడటానికి 20 మంది టెర్రరిస్టులు యత్నిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే బిహార్‌‌లోని ఇండో–నేపాల్ బోర్డర్ ద్వారా కూడా టెర్రరిస్టుల బృందం చొరబడొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో బార్డర్ ఏరియాల్లో చొరబాట్లను విఫలం చేయడానికి పెట్రోలింగ్‌ను పటిష్టం చేయాలని సెక్యూరిటీ ఫోర్సెస్‌కు ప్రభుత్వం ఆదేశించిందని తెలిసింది.

Latest Updates