రూ.15 వేల బైక్ కి రూ.23 వేల ఫైన్

కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పలు రాష్ట్రాల్లో… ఛలాన్ల మోత మోగుతున్నాయి.  ట్రాఫిక్ రూల్స్ పాటించలేదన్న కారణంగా వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ లు వేస్తున్నారు. ఢిల్లీలో ఓ వ్యక్తికి ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని ఏకంగా రూ. 23వేలు ఫైన్ వేశారు. దినేష్‌ మదన్‌ అనే వ్యక్తి తన టూ వీలర్‌పై వెళుతుండగా గురుగ్రామ్‌ పోలీసులు అతడిని ఆపారు. లైసెన్సు, ఆర్‌సీ తదితర పత్రాలు చూపించమని అడిగారు. అవన్ని ఇంటి దగ్గర ఉండటంతో దినేష్‌ చూపించలేకపోయాడు. ఇంటికి వెళ్లి తీసుకువస్తానని పోలీసులను అడిగినప్పటికీ వారు అనుమతించలేదు.

డ్రైవింగ్ చేసేటప్పుడు లైసెన్సు, ఆర్‌సీ లేకపోవడం, హెల్మెట్‌ పెట్టుకోకపోవడం, ఇన్సూరెన్సు లేకపోవడం.. ఇలాంటి కారణాలతో నిబంధనలను అతిక్రమించాడని పోలీసులు దినేష్ కు రూ.23వేలు జరిమానా విధించారు. ఈ జరిమానాకు సంబంధించిన ఛలాన్‌ను చూసిన దినేష్‌కు షాకవడం అతని వంతైంది. చివరకు చేసేదేం లేక సెకండ్‌ హ్యాండ్‌లో రూ.15వేలకు కొన్న తన ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి వచ్చానని మీడియాకు వెల్లడించాడు.

Latest Updates