మ‌ర్క‌జ్ నుంచి వ‌చ్చిన వ్య‌క్తికి 2 సార్లు నెగిటివ్ మూడోసారి పాజిటివ్

నిర్మ‌ల్ జిల్లా: మ‌ర్క‌జ్ నుంచి వచ్చిన వ్య‌క్తికి నెల రోజుల త‌ర్వాత‌ క‌రోనా పాజిటివ్ రావ‌డం నిర్మ‌ల్ జిల్లాలో క‌ల‌క‌లం రేపుతోంది. రెండు సార్లు నెగెటివ్ వ‌చ్చిన వ్య‌క్తికి మూడోసారి చెక్ చేసిన‌ప్పుడు పాజిటివ్ రావ‌డంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మూడు రోజుల కింద వైరస్​ లక్షణాలు కనిపించడంతో మళ్లీ టెస్టులు చేయగా పాజిటివ్​ వచ్చింది.

దీంతో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులను క్వారంటైన్ ​కు తరలించారు. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన జిల్లా యంత్రాంగం క‌రోనా పాజిటివ్ వ్య‌క్తితో పాటు ప్రైమ‌రీ, సెకండ‌రీ కాంటాక్ట్స్ పై దృష్టి పెట్టింది. హోంక్వారంటైన్ లో ఉన్న వారంద‌రినీ మ‌రోసారి టెస్టులు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

 

Latest Updates