ఫంక్షన్‌ హాల్స్‌, హోటల్స్‌లో కరోనా బెడ్లు

  • వచ్చే వారానికి 20వేల బెడ్లు రెడీ చేయనున్న ఢిల్లీ సర్కార్‌‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకి కేసులు పెరిగిపోవడం, రానున్న రోజుల్లో మరిన్ని హాస్పిటల్‌ బెడ్లు అవసరం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్‌‌ సన్నాహాలు చేస్తోంది. వారంలో దాదాపు 20వేల బెడ్లను రెడీ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. హోటల్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌లో బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. 80 ఫంక్షన్‌ హాల్స్‌లో 11వేల బెడ్లను, 40 హోటల్స్‌లో 4వేల బెడ్లను అరేంజ్‌ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 10 నుంచి 49 బెడ్లు ఉన్న నర్సింగ్‌ హోమ్‌లు కూడా కరోనా పేషంట్ల కోసం రిజర్వ్‌ చేసినట్లు చెప్పారు. దీంతో నర్సింగ్‌ హోమ్‌లలో మొత్తం 5వేల బెడ్లు ఉంటాయని చెప్పారు. ఇప్పటికే కొన్ని హోటల్స్‌లో కరోనా ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ చేశారని, జిల్లా అధికారులు వాటిని పర్యవేక్షిస్తున్నారని అన్నారు. దాని కోసం ప్రత్యేక గైడ్‌ లైన్స్‌ కూడా రిలీజ్‌ చేశారన్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు దాదాపు 38 వేల కేపులు నమోదయ్యాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. జులై చివరి నాటికి 5.5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అన్నారు. ఈ నేపథ్యంలో బెడ్లు కొరత రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.

Latest Updates