అంత్యక్రియలకు వెళ్లేందుకు రిషి కపూర్ కూతురుకు పర్మిషన్

న్యూఢిల్లీ: రిషి కపూర్ కూతురును తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ముంబై వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. కేన్సర్ తో పోరాడుతూ ప్రముఖ బాలివుడ్ యాక్టర్ రిషి కపూర్ ఈ రోజు ముంబై ఆస్పత్రిలో చనిపోయారు. మరోవైపు కరోనా ఎఫెక్టుతో దేశవ్యాప్త లాక్​డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో రిషి కపూర్ అంత్యక్రియలకు హాజరు కావడానికి ఢిల్లీలో ఉన్న రిషి కూతురు రిధిమా షాహ్నితో పాటు భారత్ సాహ్ని, సమారా సాహ్ని, అక్షయ్ సాహ్ని, ద్రిలక్ష్మీ రాయ్ లకు మంబై వెళ్లేందుకు అనుమతించినట్లు ఢిల్లీ సౌతీస్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆర్పీ మీనా మీడియాతో చెప్పారు.

Latest Updates