ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడొద్దు: కమిషనర్

ఢిల్లీ:  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నిషేదాజ్ఞలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు రాకూడదన్నారు. వినోదం, కాలక్షేపం కోసం బయటకు రావొద్దని చెప్పారు

ర్యాలీ, నిరసనలు, వినోద ప్రదర్శనల్లో కూడా ఐదుగురు కంటే ఎక్కువ మంది పాల్గొనవద్దన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ప్రజా రవాణాల్లో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి 31  వరకు ఇవే ఆదేశాలు వర్తిస్తాయని, ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

Latest Updates