వీడియో: కారుతో గుద్ది.. మీది నుంచి ఎక్కించిన పోలీస్ ఆఫీసర్

నిర్లక్ష్యంగా కారు నడిపి గుద్దడమే కాకుండా.. ఆపకుండా మీది నుంచి ఎక్కించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రోడ్డు దాటుతున్న 56 ఏళ్ల మహళను ఢిల్లీ పోలీస్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ యోగేంద్ర కారుతో గుద్దాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్లు వచ్చి మహిళను లేపడానికి ప్రయత్నించారు. కానీ, యోగేంద్ర మాత్రం కారులో నుంచి కనీసం దిగకుండా.. ఆపినట్లే ఆపి వెంటనే కారును ముందుకు పోనివ్వడానికి ప్రయత్నించాడు. దాంతో కారు మహిళ మీది నుంచి వెళ్లింది. వెంటనే చుట్టుపక్కల వాళ్లు కారును అడ్డగించి.. యోగేంద్రను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘాజిపూర్ జిల్లా.. చిల్లా అనే గ్రామంలో శుక్రవారం సాయంత్రం 6:35 గంటలకు జరిగింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. నిర్లక్ష్యంగా కారు నడిపి.. మహిళను గాయపరిచినందుకు యోగేంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు.

For More News..

కరోనాతో ప్రముఖ తెలుగు ప్రొడ్యూసర్ మృతి

వాటర్ ట్యాంకర్ లో కాళ్లు కడుకున్న డ్రైవర్.. వీడియో వైరల్

సినిమాలు లేక కిరాణ కొట్టు పెట్టుకున్న దర్శకుడు

అందరికీ నార్మాల్ మాస్క్.. ఈయనకు మాత్రం గోల్డ్ మాస్క్

Latest Updates