దిష్టి బొమ్మలతో కరోనాపై అవగాహన

ఢిల్లీ పోలీసుల వినూత్న ప్రయత్నం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకీ పెరుగుతుండటంతో పోలీసు అధికారులు అవేర్ నెస్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ అవసరం, ఆంక్షల గురించి పౌరులకు వివరిస్తున్నారు. దీంట్లో భాగంగా ఢిల్లీ పోలీసులు కూడా వినూత్న పద్ధతిలో ప్రజల్లో అవేర్ నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కరోనాను పోలి ఉండే దిష్టి బొమ్మలపై ‘స్టే హోమ్’ అని రాసి.. చాందిని మహల్ ఏరియాలోని కొన్ని చోట్ల పెట్టారు. ఈ దిష్టి బొమ్మలకు నల్ల కళ్లద్దాలు, మాస్క్ తొడిగి ఉండటం గమనార్హం. బయట తిరగడం ఎంత ప్రమాదకరమో చెప్పడానికే దిష్టి బొమ్మలను పెట్టామని డీసీపీ సంజయ్ భాటియా తెలిపారు.

Latest Updates