టైమ్ కు డ్యూటీకి రాని 36 మంది పోలీసులు స‌స్పెండ్

న్యూఢిల్లీ: స‌మ‌యానికి విధుల‌కు హాజ‌రుకానందున ఈ శ‌నివారం 36 మంది పోలీస్ సిబ్బందిని స‌స్పెండ్ చేశారు ఢిల్లీ పోలీస్ అధికారులు. బ‌క్రీద్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా కొంత‌మంది సిబ్బందిని ఢిల్లీ నార్త్ వెస్ట్ జిల్లాలో నియ‌మించారు. అయితే ఉద‌‌యం 5:00 గంట‌ల‌కు డ్యూటిలో చేరిన‌ట్టు రిపోర్ట్ చేయాల్సి ఉండ‌గా.. 6:30 వరకు కూడా రిపోర్ట్ చేయక‌పోవ‌డంతో వారిని సస్పెండ్ చేశామ‌ని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్‌వెస్ట్ జోన్) విజయంత ఆర్య చెప్పారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ఆయ‌న తెలిపారు.

Latest Updates