నేడు ఢిల్లీ పోలింగ్​ : 70 సెగ్మెంట్లలో 672 మంది పోటీ

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలోని మొత్తం 70నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎలక్షన్​ కమిషన్​ ప్రకటించింది. శనివారం జరిగే పోలింగ్​కు అంతా సిద్ధమని తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ జరుగుతుందని పేర్కొంది. పోలింగ్​ కేంద్రాల్లో టెక్నికల్, సెక్యూరిటీ ఏర్పాట్లను పకడ్భందీగా చేశామని పేర్కొంది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న షాహీన్​బాగ్​ఏరియాతో పాటు ఇతర సున్నితమైన ప్రాంతాల్లోని 5 పోలింగ్​ కేంద్రాలపై మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఢిల్లీ ఈసీ అధికారులు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి సెక్యూరిటీ ఏర్పాట్లు చేసి, ఓటర్లలో కాన్ఫిడెన్స్​ నింపే చర్యలు తీసుకున్నామని అన్నారు. మొత్తం 70 నియోజకవర్గాల్లోని 1.47 కోట్ల మంది ఓటర్లు శనివారం తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 18, 19 ఏళ్ల వయస్కులు 2,32,815 మంది కాగా, 80‌‌‌‌‌‌‌‌ ఏళ్లు దాటిన సీనియర్​ సిటిజన్ల  సంఖ్య 2,04,830.. ఇక సర్వీస్​ ఓటర్లు 11,608 మంది ఉన్నారని ఢిల్లీ సీఈఓ రణబీర్​ సింగ్​ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్​ శాతాన్ని పెంచేందుకు ఢిల్లీ సీఈవో ఆఫీస్​ వినూత్న ప్రచారం చేసింది. మెగా మల్టీ డొమైన్​ ఔట్​డోర్​క్యాంపెయిన్​తో పాటు మేజర్​ ఎఫ్​ఎం స్టేషన్లలోనూ ప్రచారం చేసింది. అధికార ఆమ్​ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ట్రయాంగులర్​ పోటీ జరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల ఫలితాలను మరోసారి రిపీట్​ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ.. మొన్నటి లోక్​సభ ఎన్నికల ఫలితాలను ఈ ఎన్నికల్లో రాబట్టాలని బీజేపీ ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి.

సెక్యూరిటీ ఏర్పాట్లిలా..

అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎన్ఎస్జీ, ఎస్ఎస్​బీలకు చెందిన 190 కంపెనీల కేంద్ర బలగాలు, 19,000మంది హోం గార్డులు, 42,000 పోలీసులతో పాటు మొత్తం మంది 69వేల మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు స్పెషల్​ సీపీ(ఇంటలిజెన్స్) ప్రవీర్​ రంజన్ తెలిపారు. 2019 లోక్​సభ ఎన్నికలలో మోహరించిన బలగాలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువని అన్నారు. ఢిల్లీలోని 2689 లొకేషన్లలో మొత్తం 13,750 పోలింగ్​ బూత్​లు ఏర్పాటు చేశారు. ఇందులో 516 లొకేషన్లలోని 3,704  పోలింగ్​ కేంద్రాలను అధికారులు క్రిటికల్​ పోలింగ్​ స్టేషన్లుగా ప్రకటించారు. ఈ కేంద్రాల్లో పోలీస్​ సెక్యూరిటీతో పాటు పారామిలటరీ బలగాలను కూడా మోహరిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates