టూరిజంలో ఢిల్లీ వరల్డ్‌ నంబర్‌ 11

  •                 ముంబై, ఆగ్రా, ఇతర నగరాలకూ చోటు
  •                 వరల్డ్ నంబర్ వన్ సిటీగా హాంకాంగ్

వరల్డ్ టాప్100 సిటీస్ ర్యాంకింగ్స్ లో మన దేశానికి చెందిన ఏడు సిటీలు చోటు దక్కించుకున్నాయి. 2019 సంవత్సరంలో ఎక్కువ మంది టూరిస్టులు సందర్శించిన దేశాలకు ఈ ర్యాంకింగ్స్ ను యూకేకు చెందిన గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ యూరోమానిటర్ ఇంటర్నేషనల్ సంస్థ  ప్రకటించింది. ఆసియాలోని 43 సిటీలు పాపులర్ డెస్టినేషన్స్ గా నిలిస్తే.. వాటిలో  మన దేశానికి చెందిన ఏడు సిటీలు ఉన్నాయి. కొన్ని నెలలుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్ నంబర్ వన్ స్పాట్ లో ఉండటం విశేషం. మకావు, బ్యాంకాక్, సింగపూర్, లండన్, పారిస్, దుబాయి, ఇస్తాంబుల్,  కౌలాలంపూర్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వరల్డ్ మోస్ట్ పాపులర్ సిటీ డెస్టినేషన్స్ జాబితాలో న్యూయార్క్ సిటీ 8 నుంచి11వ స్థానానికి పడిపోయింది.

11వ ప్లేస్ లో ఢిల్లీ…

టూరిజం ఇన్ ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఎయిర్ పోర్టు, లగ్జరీ, మెడికల్, స్పోర్ట్స్ కల్చరల్ టూరిజం కారణంగా వరల్డ్ మోస్ట్ పాపులర్ సిటీ డెస్టినేషన్స్ జాబితాలో ఢిల్లీ11వ స్థానంలో నిలిచినట్లు యూరోమానిటర్ రిపోర్ట్ తెలిపింది. ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై14వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ముంబైని1.2 కోట్ల మంది టూరిస్టులు సందర్శించినట్లు రిపోర్ట్‌ వెల్లడించింది. వరల్డ్ వండర్స్ లో ఒక్కటైన తాజ్ మహల్ ఉన్న ఆగ్రా సిటీ 26వ స్థానంలో నిలిచింది. 2018లో 80 లక్షల మంది టూరిస్టులు ఈ సిటీని చూసినట్లు రిపోర్ట్ పేర్కొంది. ఇండియాలో ఉన్న కల్చర్, డైవర్సిటీ, అందుబాటు ధరలతో టూరిస్టులను ఈ సిటీలు ఎక్కువగా ఆకట్టుకుంటున్నట్లు రిపోర్ట్  వెల్లడించింది. గ్లోబల్ టూరిస్టు ప్లేసెస్ లో బాగా పాపులర్ అయిన ఇండియన్ సిటీల్లో ఢిల్లీ, ముంబయి, ఆగ్రా టాప్ లో ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇంటర్నేషనల్ విజిటర్స్ విభాగంలో ఢిల్లీ 8వ పాపులర్ సిటీగా నిలిచినట్లు పేర్కొంది.

దక్షిణాదిన చెన్నై టాప్..

దక్షిణాదిలో చెన్నై టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో చెన్నై సిటీ 36వ ప్లేస్ లో ఉంది. ఈ జాబితాలో బెంగళూరుకు తొలిసారి చోటు దక్కింది. ఈ జాబితాలో బెంగళూరు చివరిస్థానంలో(100) నిలిచింది. చెన్నై, బెంగళూరు లాంటి నగరాల సగటు గ్రోత్ రేట్ 25 శాతం ఉన్నట్లు యూరో మానిటర్ వెల్లడించింది. పింక్ సిటీ జైపూర్ 34వ స్థానంలో నిలిచింది. కోల్ కతా76వ స్థానంలో ఉంది. 400 సిటీల్లో టూరిస్టుల స్టే ఆధారంగా రిపోర్టును తయారు చేసినట్లు యూరో మానిటర్ సంస్థ తెలిపింది.  ఢిల్లీ మరో మూడు స్థానాలు మెరుగుపడి 8వ స్థానంలో నిలిచే అవకాశం ఉందని, ఆగ్రా మరో 8 స్థానాలు మెరుగుపడుతుందని రిపోర్ట్ అంచనా వేసింది. చెన్నై 31, కోల్ కతా మరో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 74 వ ప్లేస్ లో నిలవచ్చని అంచనా వేసింది.

మన పాపులర్ సిటీలు, వాటి ర్యాంకులు

ఢిల్లీ-11,ముంబై-14,ఆగ్రా-26,జైపూర్-34,చెన్నై-36,కోల్ కతా-76,బెంగళూరు-100