ఢిల్లీ అల్లర్లలో ఫైరింగ్ చేసిన షారూఖ్ అరెస్ట్

ఢిల్లీ అల్లర్లలో తుపాకితో ఫైరింగ్ చేసిన షారూఖ్ ను క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 24న నార్త్ ఈస్ట్ ఢిల్లీలో జరిగిన అల్లర్లలో షారూఖ్ అనే వ్యక్తి ఎనిమిది రౌండ్లు ఫైరింగ్ చేశాడు. దీంతో పాటు అప్పుడు అల్లర్లను కంట్రోల్ చేస్తున్న పోలీస్ ను గన్ తో బెదిరించిన విజువల్స్ అప్పుడే బయటకు వచ్చాయి. అయితే ఆ రోజు నుంచి షారూఖ్ పరారీలో ఉన్నాడు. అతన్ని వెతకడానికి ఢిల్లీ పోలీసులు పది టీంలుగా గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం పొద్దున షారూఖ్ ను ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలో అరెస్ట్ చేశారు పోలీసులు. మంగళవారం మధ్యాహ్నం మీడియా ముందుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates