ప్రపంచానికి దూరంగా ప్లాస్టిక్!

భూగోళమంతా విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. పెరిగిపోతున్న ప్లాస్టిక్ భూమిని కలుషితం చేస్తోంది. అయితే ఈ ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ కు వాడుకుంటే మంచి ఆదాయం పొందొచ్చు.అనేక మందికి ఉపాధి కల్పించొచ్చు. అంతకుమించి ప్లాస్టిక్ వల్ల వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణానికి మేలు చేయొచ్చు. ఈ పనే చేస్తోంది ఢిల్లీకి చెం దిన ఒక సంస్థ.

ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి వాడుకోగలిగితే బోలెడంత ఆదాయం. పర్యావరణానికీ మంచిది. ఢిల్లీకి చెందిన దినేశ్ పారిక్, సచిన్ శర్మలు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, రీ సైక్లింగ్ చేసే ‘జెమ్ ఎన్విరో మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థను స్థాపించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డులో ‘ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్స్ (పీఆర్ ఓ)గా రిజిస్టర్ అయిన సంస్థల్లో ‘జెమ్’ ఒకటి. పీఆర్ఓ లు వ్యర్థాలను సేకరించి, ప్రాసెస్ చేస్తాయి.

అసంఘటిత రంగం

దేశంలో అతిపెద్ద అసంఘటిత రంగాల్లో వ్యర్థాల నిర్వహణ ఒకటి. ఈ రంగంపై అవగాహన ఉన్నది కొందరికే. ఆకొందరిలో సచిన్, దినేశ్ లు కూడాఉన్నారు. వీళ్లిద్దరూ ‘గణేశా ఎకోస్పియర్ లిమిటెడ్’ అనే సంస్థలో పని చేశారు. ఈసంస్థ పాలిస్టర్ ను రీసైక్లింగ్ చేస్తుంది.ఇక్కడ పని చేస్తున్న సమయంలోనే దేశంలో ప్లాస్టిక్ సేకరణ, రీసైక్లింగ్ రంగంపై వీళ్లకు ఒక అవగాహన వచ్చింది.‘దేశంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ రంగం అంతగా అభివృద్ధి చెందలేదు. సరైన అవగాహన లేకపోవడంతో సేకరణ జరగడం లేదు. ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అప్పుడు సరైన పద్ధతుల్లో ప్లాస్టిక్ సేకరించాలని నిర్ణయించాం. కొంతకాలం రీసెర్చ్​ చేసి 2013లో ‘జెమ్’ సంస్థను స్థాపించి ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తున్నాం’ అని చెప్పారు దినేశ్, సచిన్ లు. సాధారణంగా ప్లాస్టిక్ సేకరణ అనగానే వాడి పడేసిన బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు, ఇతర ఉత్పత్తులు అనుకుంటారు. కానీ, వీటిని తయారు చేసే సంస్థల్లో కూడా బోలెడన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతాయి. అందుకే ఇటు కంపెనీలనుంచి, అటు వినియోగం తర్వాత దొరికే ప్లాస్టిక్ ను వీళ్లు సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక విధానాల్ని పాటించారు.

పదిహేను రాష్ట్రాల్లో

దేశంలోని పదిహేను రాష్ట్రాల్లో, దాదాపు యాభై వరకు ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రధాన నగరాల్లోని షాపింగ్ మాల్స్​ సమీపంలో దీనికోసం‘ఆర్ వి ఎమ్ (రివర్స్​ వెండింగ్ మెషీన్)లను ఏర్పాటు చేశారు. అంటే ప్లాస్టిక్ బాటిళ్లను ఈ మెషీన్లలో వేయొచ్చు. ఒక్కో బాటిల్ కు రూపాయి చొప్పున ఈ మెషీన్ అందిస్తుంది. వీటితోపాటు చిన్న చిన్న బహుమతులు కూడా ఉంటాయి. ఒక్క మెషీన్ రోజుకు ఐదు వందల వరకు బాటిళ్లను సేకరించగలదు. ఈ మెషీన్ ఖరీదు ఒక్కోటి ఐదు లక్షల రూపాయలు ఉంటుంది.

పెద్ద కంపెనీలు కూడా

‘బిస్లరీ, పెప్సికో, కోకా–కోలా’ వంటి పెద్దసంస్థలు సైతం ప్లాస్టిక్ వ్యర్థాల్ని జెమ్ సంస్థకు ఇస్తు న్నాయి. కార్పొరేట్ సంస్థల ద్వారానే కాకుండా వివిధ స్వచ్ఛంద సంస్థలు, చెత్త సేకరించే వాళ్ల దగ్గరి నుంచి కూడా ప్లాస్టిక్ ను తీసుకుంటున్నారు. రోడ్ల పక్కన చెత్త ఏరుకునే వాళ్లకు తక్కువ ఆదాయం ఉంటుంది. వాళ్లకు కూడా పాతిక శాతం ఎక్కువ ఆదాయం ఇస్తోంది జెమ్.

దుస్తులు, బ్యాగులు

ఇతర సంస్థలు ప్లాస్టిక్ ను రీసైక్లిం గ్ చేసి తిరిగి ప్లాస్టిక్ ఉత్పత్తులుగానే మారుస్తాయి. కానీ,జెమ్ సంస్థ మాత్రం ప్లాస్టిక్ ను చిన్న చిన్న ఫైబర్ లుగా మారుస్తోంది. ‘గణేశా ఎకోస్పియర్’ సంస్థతో కలిసి, ఈ ఫైబర్ తో దుస్తులు, బ్యాగులు, లైట్ ఫర్నిచర్, సాఫ్ట్​ టాయ్స్ వంటివి రూపొందిస్తోంది. వీటిని ‘బీయింగ్ రెస్పాన్సిబుల్’ పేరుతో విక్రయిస్తు న్నారు. ‘జెమ్’సంస్థలో ప్రత్యక్షంగా వందమందికి పైగా పనిచేస్తుంటే, మూడున్నర వేల మంది వరకు చెత్తసేకరణ కోసం పని చేస్తు న్నారు. ఈ సంస్థ ఇప్పటివరకు దాదాపు లక్ష టన్నుల ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేసింది. దీనివల్ల 1.40 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నియంత్రించగలిగారు. ఈ పనుల వల్ల కంపెనీకి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది.

జీవహింసకు వ్యతిరేకంగా

దాదాపు నూటయాభై ఏళ్ల క్రితం నాటిసంగతి. అప్పట్లో బిలియర్డ్స్ ఆట చాలా ఫేమస్. ఈ గేమ్ లో క్యూస్టిక్, బాల్స్వాడుతారు. వీటి తయారీకి ఏనుగు,ఖడ్గమృగం వంటి జంతువుల దంతాలనువాడేవాళ్లు. అయితే బిలియర్డ్స్ బాల్స్రూపొందిం చే న్యూయార్క్ కు చెం దిన ఒకసంస్థ జంతువులను హింసిం చకుం డా,దంతాలతో పని లేకుం డా బాల్స్ తయారుచేసే ప్రత్యామ్నాయ విధానాన్నిరూపొందిం చిన వాళ్లకు పది వేల డాలర్లుబహుమతిగా ఇస్తామని ప్రకటిం చిం ది.కొన్నాళ్ల తర్వాత ‘‘జాన్ వెస్లీ హయట్ ’’ అనేనిపుణుడు ‘సెల్యులాయిడ్’ అనే ఒకరకమైన పాలిమర్ ను సెల్యులోజ్ నుంచి రూపొందిం చాడు. ఇదే సింథటిక్ ప్లాస్టిక్. దీనితో తర్వాతి కాలంలో బిలియర్డ్స్ బాల్స్ రూపొందాయి. దీని కోసం వాడిన ఈ ప్లాస్టిక్ ఇప్పుడు భూగోళమంతా నిండిపోయింది. ఒక రకంగా ప్రపంచాన్నికబళిస్తోం ది. జంతువుల హింసకు వ్యతిరేకంగా తయారైన ఈ ప్లాస్టిక్ ఇప్పుడు లక్షలాది మూగజీవాల్ని బలితీసుకుంటోంది. భూమిపై జీవరాశి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది.