ఎన్ఐఏకు ఫోన్ చేసి బెదిరించిన యువకుడు

సినిమాలను ఇన్‌‌‌‌స్పిరేషన్‌‌‌‌గా తీసుకున్నాడో ఏమో.. నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ (ఎన్​ఐఏ)కి బెదిరింపు కాల్‌‌‌‌ చేసి అరెస్టయ్యాడు 22 ఏళ్ల ఢిల్లీ యువకుడు. ఫోన్‌‌‌‌ నంబర్‌‌‌‌ ద్వారా ట్రాక్‌‌‌‌ చేసి పట్టుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు.

కామర్స్ స్టూడెంట్‌‌‌‌

శుభమ్‌‌‌‌ కుమార్‌‌‌‌ పాల్‌‌‌‌ కామర్స్‌‌‌‌ స్టూడెంట్. ఢిల్లీలో ఉంటాడు. తండ్రి వ్యాపారి. మౌంటెనీరింగ్‌‌‌‌ వస్తువుల బిజినెస్‌‌‌‌ చేస్తుంటాడు. ఎందుకో ఏమోగాని బుధవారం పాల్‌‌‌‌ ముంబై వచ్చాడు. ఓ లాడ్జీని కిరాయికి తీసుకున్నాడు. గురువారం నేషనల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ ఏజెన్సీకి ఫోన్‌‌‌‌ చేశాడు. ‘నా మాటలు జాగ్రత్తగా వినండి. ముంబైలో రేపు పెద్ద ప్రమాదం జరగబోతోంది. ఏమైనా చేయాలనుకుంటే చేయండి’ అని ఫోన్‌‌‌‌ పెట్టేశాడు. దీంతో ఎన్‌‌‌‌ఐఏ అధికారులు ముంబై పోలీసులను అలర్ట్‌‌‌‌ చేశారు. నార్త్‌‌‌‌ ముంబై నుంచి కాల్‌‌‌‌ వచ్చిందని చెప్పారు. గో రెగావ్‌‌‌‌ తూర్పులోని నెస్కో ఐటీ పార్క్‌‌‌‌ దగ్గర నుంచి ఫోన్‌‌‌‌ వచ్చిందని ముంబై క్రైం బ్రాంచ్‌‌‌‌ పోలీసులు ట్రాక్‌‌‌‌ చేశారు. అక్కడే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ స్టార్ట్‌‌‌‌ చేశారు.

పాక్​, సిరియా వెబ్​సైట్​లు..

పాల్‌‌‌‌ సరైన సమాధానం ఇవ్వకపోయే సరికి అతని ఫోన్‌‌‌‌ కాల్‌‌‌‌ వివరాలను పోలీసులు చెక్‌‌‌‌ చేశారు. పాకిస్థాన్‌‌‌‌ నంబర్లకు 9.17 నుంచి 9.32 మధ్య.. ఢిల్లీ ఎన్‌‌‌‌ఐఏకు 10.25కు కాల్‌‌‌‌ చేసినట్టు గుర్తించారు. పాకిస్థాన్‌‌‌‌, సిరియాకు చెందిన 11 వెబ్‌‌‌‌సైట్లనూ చెక్‌‌‌‌ చేసినట్టు కనుగొన్నారు. కొన్ని పాకిస్థాన్‌‌‌‌ నంబర్లకూ కాల్‌‌‌‌ చేసినట్టు గుర్తించారు. తన ఫోన్‌‌‌‌ గూగుల్‌‌‌‌ హిస్టరీలో ముంబై అండర్‌‌‌‌వరల్డ్‌‌‌‌ డాన్స్‌‌‌‌, పాకిస్థానీ వర్చువల్‌‌‌‌ నంబర్స్‌‌‌‌, పాకిస్థానీ ఐఎస్‌‌‌‌ఐ నంబర్‌‌‌‌, డీటెయిల్స్‌‌‌‌ అబౌట్‌‌‌‌ సిరియా, ఐఎస్‌‌‌‌ఐ ఏజెంట్స్‌‌‌‌, ఐఎస్‌‌‌‌ఐ పాకిస్థాన్‌‌‌‌ ఈ మెయిల్‌‌‌‌ ఐడీ లాంటి కీవర్డ్‌‌‌‌ గుర్తించామని పోలీసులు చెప్పారు. అసలు అతనెందుకు ఫోన్‌‌‌‌ చేశాడో తెలుసుకోవడానికి లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఐపీసీ 505 ప్రకారం పాల్‌‌‌‌పై కేసు నమోదు చేశామని, పాల్‌‌‌‌ను అరెస్టు చేయడానికి ముందే ముంబైలోని రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు చేశామని తెలిపారు. సినిమాల్లో చూపినట్టు పోలీసులు అలర్ట్‌‌‌‌గా ఉన్నారో లేదో చెక్‌‌‌‌ చేయడానికి అలా ఫోన్‌‌‌‌ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.

Latest Updates