పంజాబ్ పై ఢిల్లీ సూపర్ విక్టరీ

స్టోయినిస్ ఆల్ రౌండ్‌ షో
రబడ సూపర్ బౌలింగ్
మయాంక్ పోరాటం వృథా

వారెవ్వా.. ఏం మ్యాచ్ ..! ఓవైపు స్టోయినిస్ (21 బాల్స్ లో 53, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) షో చేస్తే.. మరోవైపు మయాంక్ అగర్వాల్ (60 బంతుల్లో 89, 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ఏకంగా మాయ చేశాడు.. ! కానీ ఇద్దరి పోరాట స్ఫూర్తికి పరీక్ష పెడుతూ టైగా ముగిసిన మ్యాచ్ లో.. సూపర్ ఓవర్ స్పెషలిస్ట్ రబడ అతిపెద్ద మ్యాజిక్ చేశాడు..! వరుస బాల్స్ లో రెండు వికెట్లు తీసి మూడు బంతులకే పంజాబ్ ను కట్టడి చేశాడు.. ! దీంతో చేజారిపోయిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ని మళ్లీ విజయం పథంలో నిలబెట్టాడు..!! విజయానికి అవసరమైన మూడు రన్స్ ను సులువుగా సంపాదించిన ఢిల్లీ కమాల్ చేస్తూ ఐపీఎల్ లో బోణీ కొట్టింది..!!

దుబాయ్ : ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్​ అంచనాలను అందుకుంది. ఆరంభంలో తడబడినా.. సమష్టి కృషితో ఆదివారం పంజాబ్ తో జరిగిన లీగ్​ మ్యాచ్​లో సూపర్ ఓవర్ లో విజయాన్ని దక్కించుకుంది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 రన్స్​ చేసింది. శ్రేయస్​ అయ్యర్ (32 బాల్స్​లో 39, 3 సిక్సర్లు ), రిషబ్ పంత్ (29 బాల్స్​లో 31, 4 ఫోర్లు) రాణించారు. తర్వాత పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 రన్స్​ చేసింది. రబడ, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు. స్టోయినిస్‌ కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​’ అవార్డు లభించింది.

‘టాప్’ లేచింది..

ఫ్రెష్ గ్రీన్ వికెట్​పై బ్యాటింగ్​కు దిగిన ఢిల్లీ.. షమీ (3/15) రూపంలో అతిపెద్ద ముప్పు ఎదుర్కొంది. తొలి ఓవర్లోనే ఓ ఫోర్ తో టచ్​లో కనిపించిన పృథ్వీ షా (5).. స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ (0)ను రనౌట్​ చేసి మూల్యం చెల్లించాడు. రెండో ఓవర్ లో షమీ వేసిన బౌన్సర్ ధవన్ గ్లోవ్స్​ను తాకుతూ వెళ్లింది. కానీ వికెట్​ కీపర్ రాహుల్​ క్యాచ్​ అందుకోవడంలో విఫలమయ్యాడు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా ధవన్ రన్ కోసం సగం పిచ్​ వరకు పరుగెత్తినా… పృథ్వీ పెద్దగా స్పందించలేదు. మిడ్​ వికెట్​ నుంచి గౌతమ్​ ఇచ్చిన త్రోను అందుకున్న రాహుల్​ బెయిల్స్​ పడగొట్టాడు. నాలుగో ఓవర్ లో మళ్లీ షమీ డబుల్​ స్ట్రయిక్​ ఇచ్చాడు. మూడో బాల్​కు పృథ్వీని, లాస్ట్​ బాల్​కు హెట్​మెయర్ (7)ను ఔట్​ చేసి షాకిచ్చాడు. దీంతో 4 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 13/3గా మారింది. ఈ దశలో వచ్చిన కెప్టెన్ శ్రేయస్​ , పంత్ ఇన్నింగ్స్​ను బాగు చేసే ప్రయత్నం చేశా రు. గౌతమ్​ వేసిన 9వ ఓవర్ లో ఓ ఫోర్ , సిక్స్​తో రెండు క్లాసికల్​ షాట్స్​ ఆడిన పంత్ జోరు పెంచాడు. తర్వాతి ఓవర్ లో మరో నాలుగు రన్స్​ రావడంతో తొలి 10 ఓవర్లలో ఢిల్లీ 49/3 స్కోరు చేసింది. తొలి మ్యాచ్​ ఆడుతున్న రవి బిష్ణోయ్​ (1/22) కూడా మంచి టర్నింగ్​తో ఫర్వాలేదనిపించాడు. తర్వాతి రెండు ఓవర్లలో కాస్త నెమ్మదించిన అయ్యర్ .. 13వ ఓవర్ (గౌతమ్​)లో రెండు సిక్సర్లు కొట్టడంతో 15 రన్స్​ వచ్చాయి . తర్వాతి ఓవర్ (రవి)లో ఫోర్ తో దూకుడు పెంచిన పంత్ .. లాస్ట్​ బాల్​కు బౌల్డ్​ అయ్యాడు. దీంతో 73 రన్స్​ పార్ట్​నర్ షిప్​ బ్రేక్​ అయ్యింది. ఆ వెంటనే సెకండ్​ స్పెల్​కు వచ్చిన షమీ.. శ్రేయస్​ను బోల్తా కొట్టించాడు. జస్ట్​ రెండు బాల్స్​లో రెండు వికెట్లు పడటంతో..15 ఓవర్లలో ఢిల్లీ సగం టీమ్​ను కోల్పోయింది.

స్కోరు బోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్‌‌: పృథ్వీ షా (సి) జోర్దాన్‌‌ (బి) షమీ 5, ధవన్‌‌ (రనౌట్‌ ) 0, హెట్‌ మెయిర్‌‌(సి) మయాంక్‌ (బి) షమీ 7, అయ్యర్‌‌ (సి) జోర్దాన్‌‌ (బి) షమీ 39, పంత్‌‌ (బి) రవి బిష్ణోయ్‌ 31, స్టోయినిస్‌ (రనౌట్‌ ) 53, అక్షర్‌‌ (సి) రాహుల్‌ (బి) కాట్రెల్‌ 6, అశ్విన్‌‌ (సి) షమీ (బి) కాట్రెల్‌ 4, రబడ (నాటౌట్‌ ) 0, నోర్జ్‌ (నాటౌట్‌ ) 3;

ఎక్స్‌‌ట్రాలు: 9 ; మొత్తం 20 ఓవర్లలో 157/8 ;

వికెట్ల పతనం: 1–6, 2–9, 3–13, 4–86, 5–87, 6–96, 7–127, 8–154 ;

బౌలింగ్‌‌: కొట్రెల్‌ 4–0–24–2, షమీ 4–0–15–3, జోర్దాన్‌‌ 4–0–56–0, గౌతమ్‌ 4–0–39–0, రవి 4–0–22–1.

పంజాబ్‌ : రాహుల్‌ (బి) మోహిత్‌‌ 21, మయాంక్‌ (సి) హెట్‌ మెయిర్‌‌ (బి) స్టోయినిస్‌ 89, కరుణ్‌ నాయర్‌‌ (సి) పృథ్వీ (బి) అశ్విన్‌‌ 1, పూరన్‌‌ (బి) అశ్విన్‌‌ 0, మ్యాక్స్‌ వెల్‌ (సి) అయ్యర్‌‌ (బి) రబడ 1, సర్ఫరాజ్‌ (సి) పృథ్వీ (బి) అక్షర్‌‌ 12, గౌతమ్‌ (సి) పంత్‌‌ (బి) రబడ 20, జోర్దాన్‌‌ (సి) రబడ (బి) స్టోయి నిస్‌ 5, షమీ (నాటౌట్‌ ) 0;

ఎక్స్‌‌ట్రాలు: 8 ; మొత్తం 20 ఓవర్లలో 157/8 ;

వికెట్ల పతనం: 1–30, 2–33, 3–34, 4–35, 5–55, 6–101, 7–157, 8– 157 :

బౌలింగ్‌‌: నోర్జ్‌ 4–0–33–0, మోహిత్‌‌ 4–0–45–1, రబడ 4–0– 28–2, అశ్విన్‌‌ 1–0–2–2, అక్షర్‌‌ 4–0–14–1, స్టోయినిస్‌ 3–0–29–2.

మయాంక్ పోరాటం..

టార్గెట్​ ఛేజింగ్​లో పంజాబ్ కు శుభారంభం దక్కలేదు. మయాంక్​ అగర్వాల్​ ఒంటరి పోరాటం చేసినా.. రాహుల్​ (21) ఉన్నం తసేపు వేగంగా ఆడి ఔటయ్యాడు. మోహిత్ బౌలింగ్​లో భారీ సిక్స్​ కొట్టిన రాహుల్​.. మరో రెండు ఫోర్లు కొట్టి అతనికే వికెట్​ ఇచ్చుకున్నాడు. ఆరో ఓవర్ లో ఐదు బాల్స్​ తేడాలో కరుణ్​ నాయర్ (1), పూరన్ (0) ను ఔట్​ చేసిన అశ్విన్ పైచేయి సాధించాడు. పవర్ ప్లేలో పంజాబ్ 35/3 స్కోరు చేసింది. భారీ ఆశలు పెట్టుకున్న మ్యాక్స్​వెల్​ (1) తర్వాతి ఓవర్ లోనే పెవిలియన్ కు చేరాడు. మయాంక్​తో కలిసిన సర్ఫరాజ్​ (12) భారీ షాట్లకు పోకుండా సింగిల్స్​తో సరిపెట్టుకున్నా డు. అయినా వికెట్​ కాపాడుకోలేకపోయాడు. పదో ఓవర్ లో పటేల్​కు వికెట్​ ఇచ్చుకున్నాడు. ఓవరాల్​గా తొలి పది ఓవర్లలో పంజాబ్ 55/5తో ఎదురీత మొదలుపెట్టింది. కృష్ణప్ప గౌతమ్​ (20)తో కలిసి ఇన్నింగ్స్​ను సుస్థిరం చేసే ప్రయత్నంలో మయాంక్​.. 11వ ఓవర్ లో స్టోయినిస్​కు భారీ సిక్సర్ రుచి చూపెట్టాడు. 13వ ఓవర్ లో మరో రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచాడు. అయితే 15వ ఓవర్ లో గౌతమ్​ లాంగాన్ , ఎక్స్​ట్రా కవర్ లో ఓ సిక్స్​, ఫోర్ కొట్టడంతో పంజాబ్ వందకు చేరువైంది. రబడ బౌలింగ్ (16వ ఓవర్ ) లో మయాంక్​ ఇచ్చిన హై క్యాచ్​ను మిడ్​ వికెట్​ రీజియన్ లో పృథ్వీ వదిలేశాడు. కానీ తర్వాతి బాల్​కు గౌతమ్​ను ఔట్​ చేయడంతో పంజాబ్ కష్టాలు మొదలయ్యాయి. చివరి 24 బాల్స్​లో 53 రన్స్​ చేయాల్సిన దశలో 17 ఓవర్ లో మయాంక్​ రెండు ఫోర్లతో 11 రన్స్​ రాబట్టాడు. తర్వాతి ఓవర్ లో రెండు సిక్సర్లు కొట్టడంతో విజయ సమీకరణం 12 బాల్స్​లో 25గా మారింది. ఈ దశలో మయాంక్​ ఇచ్చిన క్యాచ్​ను రోప్​ వద్ద శ్రేయస్​ జారవిడిచాడు. లాస్ట్​ ఓవర్ లో 13 రన్స్​ అవసరం కాగా.. మయాంక్​ సిక్స్​, ఫోర్ కొట్టి ఔటయ్యాడు. ఇక ఒక బాల్​కు ఒక రన్ కావాల్సి ఉండగా జొర్డాన్ వికెట్​ పడటంతో మ్యాచ్​ సూపర్ ఓవర్ కు దారి తీసింది.

స్టన్నింగ్ స్టోయినిస్

87/5 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ స్టార్టింగ్ లో స్లో గా ఆడినా… చి వర్లో పరుగుల వర్షం కురిపించాడు. 17వ ఓవర్ ఫస్ట్ బాల్ కు అక్షర్ పటేల్ (6) ఔటయ్యాడు. అప్పుడు 2 రన్స్ తో ఉన్న స్టోయినిస్ 18వ ఓవర్ నుంచి విజృంభణ కొనసాగించాడు. ఈ ఓవర్ లో సిక్స్ , ఫోర్ , తర్వాతి ఓవర్ లో మూడు ఫోర్లు బాదాడు. అయితే ఇదే ఓవర్ లో అశ్విన్ (4) వికెట్ పడటంతో ఢిల్లీ మళ్లీ డీలా పడినా.. జోర్డా న్ వేసిన 20వ ఓవర్ లో స్టో యినిస్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో 20 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్ గా 67 రన్స్ జతకావడంతో ఢిల్లీ మంచి స్కోరు సాధించింది.

Latest Updates