ఢిల్లీలో మద్యంపై 70 శాతం కరోనా ఫీజు

  • ఢిల్లీలో నేటి నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ: మద్యం ప్రియులకు ఢిల్లీ సర్కారు షాకిచ్చింది. మందుపై ‘స్పెషల్ కరోనా ఫీజు’ పేరిట 70 శాతం అదనంగా డబ్బులు వసూలు చేస్తామని ప్రకటించింది. ఎమ్మార్పీపై 70 శాతం సెస్ మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వస్తుందంటూ సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉత్తర్వులిచ్చారు. లాక్ డౌన్ సడలింపులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ రోజు నుంచి ఢిల్లీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతిచ్చింది.

Latest Updates