ఢిల్లీకి తాకిన ఆర్టీసీ సమ్మె : సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ధర్నా

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఢిల్లీకి చేరింది. దేశరాజధాని ఢిల్లీలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తెలంగాణ భవన్ ఎదుట ట్రేడ్ యూనియన్ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం భర్తరఫ్ చేసిన ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ యూనియన్ , aicctu నాయకులు డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన ఆర్టీసి నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా నినదించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికుల్ని వాడుకోని ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని…లేకుంటే టీఎస్ ఆర్టీసికి మద్దతుగా దేశంలోని అన్నీ ట్రేడ్ యూనియన్లతో దర్నాకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం ట్రేడ్ యూనియన్ నాయకులు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంత గిరికి వినతిపత్రం అందజేశారు.

Latest Updates