పోలింగ్ ముగిసింది.. గత ఎన్నికలతో పోలిస్తే చాలా తక్కువ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్.. కొద్దిసేపటి క్రితం క్లోజ్ అయ్యింది. ఓటింగ్ ముగిసే సమయానికి 54 శాతం పోలింగ్ నమోదైంది. అయితే.. 6 గంటలకు లైన్ లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్ మరింత పెరిగే అవకాశముంది.

ఉదయం నుంచి పోలింగ్ స్లో గా జరిగినా.. సాయంత్రానికి కాస్త స్పీడందుకుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 30 శాతం పోలింగ్ నమోదు కాగా.. తర్వాత రెండు గంటల్లోనే అది 50 శాతాన్ని దాటిపోయింది.

అయితే గతంలో 2015 ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి ఓటింగ్ ముగిసే సమయానికి కేవలం 54 శాతం మాత్రమే నమోదైంది. లైన్ లో ఉన్న వారు ఓటేసిన కూడా అది మరో పది శాతం కంటే ఎక్కువ నమోదు కాదు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి తక్కువ ఓటింగ్ నమోదు కావొచ్చని తెలుస్తుంది.

పోలింగ్ ముగియడంతో పార్టీల్లో టెన్షన్ మొదలైంది. గెలుపు ఓటములపై లెక్కలు వేసుకునే పనిలో పార్టీలు బిజీగా ఉన్నాయి. పోలింగ్ పర్సంటేజీని బట్టి.. భవిష్యత్ ఏంటనేది డిస్కస్ చేసుకుంటున్నాయి.

delhi-voting-percentage-has-seen-a-big-uptick-with-54-voter-turnout-recorded-so-far

Latest Updates