గర్భిణీని ఆస్పత్రికి తెచ్చిన కానిస్టేబుల్: పుట్టిన బిడ్డకు కానిస్టేబుల్ పేరు పెట్టిన తల్లి

లాక్ డౌన్ సమయంలో తనని సురక్షితంగా ఆస్పత్రికి తీసుకొచ్చిన కానిస్టేబుల్ కు గర్భిణీ మహిళ వెలకట్టలేని బహుమతి ఇచ్చింది.

కరోనా వైరస్ ను అరికట్టేందుకు మనదేశంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ తో రవాణా వ్యవస్థ  పూర్తిగా స్తంభించిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహకారంతో గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నార్మల్ గా ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది కానీ గర్భిణీలు, వయోవృద్ధులకు భారంగా మారిన.. అలాంటి వారి కోసం పోలీసులు అండగా నిలుస్తున్నారు. ఓ వైపు లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు.  అలాంటి వారిలో కానిస్టేబుల్ దయవీర్ సింగ్ ఒకరు.

ఢిల్లీలో దయవీర్ సింగ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఓ గర్భిణీ మహిళ పురిటినొప్పులతో బాధపడుతోంది. ఆస్పత్రికి వెళ్లాలంటే ఆటోలు, కార్లు అందుబాటులో లేవు. ఓ మహిళ పురిటినొప్పులతో బాధపడుతోంది. త్వరగా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాలని సమాచారం అందుకున్న దయవీర్ సింగ్ బాధితురాల్ని ఇంటి నుంచి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో జాయిన్ చేయించిన కొద్దిసేపటికే మహిళ ప్రసవించింది. దయవీర్ సమయానికి ఆస్పత్రికి తీసుకొచ్చాడని…లాక్ డౌన్ టైమ్ లో ప్రసవానికి ఏమాత్రం ఆలస్యమైన తల్లిబిడ్డకు ప్రమాదమేనని వైద్యులు తెలిపారు.

మరోవైపు సకాలంలో తనని ఆస్పత్రికి తీసుకొచ్చినందుకు గర్భిణీ మహిళ కానిస్టేబుల్ దయవీర్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపింది. తన కుమారుడికి కానిస్టేబుల్ దయవీర్ సింగ్ పేరు పెట్టింది.

ఈ సమయాల్లో ఆమెకు హెల్ప్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా వృత్తిని నేను గౌరవంగా భావిస్తున్నట్లు కానిస్టేబుల్ దయవీర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.

Latest Updates