రాజకీయ నాయకులు హామీలకే పరిమితం : మహిళ కమిషనర్

డిల్లీ మహిళా కమిషన్ స్వాతి ఆమరణ నిరహార దీక్ష
తెలంగాణ ప్రభుత్వం నిర్లక్షంతోనే ‘దిశ’ ఘటన

సీఎం కేసీఆర్ స్పందించిన తీరు బాగాలేదు
రాజకీయ నాయకులు హామీలు ఇవ్వడానికే పరిమితం
ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఎందుకు ఏర్పాటు చేస్తలేరు… ప్రశ్నించిన డిల్లీ మహిళా కమిషన్ స్వాతి

ఢిల్లీ: హైదరాబాద్ లో జరిగిన ‘దిశ’ అత్యాచార ఘటనపై ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. అత్యాచారం, హత్య చేసిన వారిన కఠినంగా శిక్షించాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరహార దీక్షచేస్తున్నారు ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మలివాల్.. ఆమెకు మద్దతుగా… విద్యార్థులు, మహిళలు దీక్షలో కూర్చున్నారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యం వల్లే దిశపై అత్యాచారం జరిగిందని అన్నారు స్వాతి. దిశ ఘటనపై రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తీరు బాగాలేదని చెప్పారు. వాళ్ల ఇంట్లో ఇలాంటి ఘటనలు జరిగితే ఇలాగే మాట్లాడతారా అని ఆమె ప్రశ్నించారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లు ఉన్నపటికీ వాటిని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంలేదని చెప్పారు స్వాతి. రాజకీయనాయకులు వాగ్దాలనాలు చేయడానికి మాత్రమే  పనికివస్తారని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించేంత వరకు తన ఆమరణ నిరహార దీక్ష కొనసాగుతుందని స్వాతి చెప్పారు.

Latest Updates