భర్త ఇంట్లో ఉండగానే.. అత్తమామలను చంపిన కోడలు

ఢిల్లీలో ఘోరం జరిగింది. తల్లిదండ్రులతో సమానమైన అత్తా మామలను ఓ కొడలు కిరాతకంగా చంపేసింది. ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల కవిత అనే మహిళ తన అత్తామామలైన రాజ్ సింగ్ మరియు ఓంవతిలను కత్తితో గొంతుకోసి చంపింది. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం ఉదయం 11 గంటలకు చావ్లాలోని పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ వచ్చింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చూడగా.. వృద్ధ దంపతులు మృతదేహాలు మంచం మీద పడి ఉన్నాయి. వారి ముఖంపైన మరియు గొంతుమీద పదునైన కత్తి గుర్తులు ఉన్నాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆస్తి కోసం కవిత అత్తామామలను చంపినట్లు పోలీసులు తెలిపారు.

మరో ముఖ్యవిషయమేమంటే.. ఈ హత్యలు జరిగేటప్పుడు కవిత భర్త, వృద్థ దంపతుల కుమారుడు అయిన సతీష్ సింగ్ కూడా ఇంట్లోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కవిత పిల్లలు కూడా ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. దంపతుల హత్యోదంతంలో సతీష్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలకు సంబంధించి పోలీసులు కవిత మరియు సతీష్ సింగ్ లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

For More News..

జాతీయ ఖో-ఖో జట్టు కెప్టెన్ కు తిండి కష్టాలు

పేదల కోసం రోటీ బ్యాంక్.. 11 రోజుల్లో లక్షకు పైగా చపాతీల పంపిణీ

చెన్నై రోడ్లపై కరోనా ఆటో..

హౌజింగ్ మినిష్టర్ కు కరోనా పాజిటివ్

Latest Updates