డెలాయిట్‌పై ఐదేళ్ల వేటు?

ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ దిగ్గజం ఐఎల్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌ఎస్‌ (ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ లీజింగ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్ షి యల్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌ ) ఖాతాల్లోగోల్‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌ జరిగిందనే ఆరోపణలు రావడంతో,ఎంఎన్‌సీ ఆడిట్‌ సంస్థ డెలాయిట్‌ పై వేటుకు రంగం సిద్ధమవుతోంది. రూ.90 వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయి, దివాలా బాటలో నడుస్తున్న ఐఎల్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌ఎస్‌ ఎకౌంట్లలో అవకతవకలపై ఇప్పటికే విచారణ మొదలైంది. ఐఎల్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌ఎస్‌ కు ఆడిటింగ్‌‌‌‌‌‌‌‌ సేవలు అందించిన డెలాయిట్‌ హాస్కిన్స్‌‌‌‌‌‌‌‌ అక్రమాలకు పాల్పడి ఖాతాలను అక్రమంగా మార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ కంపెనీల చట్టంలోని 140 (5)సెక్షన్‌ ప్రయోగించి దీనిని డీబార్‌‌‌‌‌‌‌‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెలాయిట్‌ అక్రమాలకు పాల్పడ్డట్టు ఆధారాలు దొరకడం వల్లే ఈ కంపెనీపై వేటువేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోందని సమాచారం.

ఏదైనా కంపెనీ ఆడిటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆడిట్‌ సంస్థ తప్పు చేసినట్టు తేలితే ప్రభుత్వానికి సదరు ఆడిటర్‌‌‌‌‌‌‌‌ను మార్చే అధికారాలు ఉంటాయి. డెలాయిట్‌ పై చర్యలు తీసుకుంటే మనదేశంలో వేటుపడ్డ రెండో ఆడిటింగ్‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఇదేఅవుతుంది. సత్యం కంప్యూటర్స్‌‌‌‌‌‌‌‌ కుంభకోణంలో ప్రైస్‌వాటర్‌‌‌‌‌‌‌‌హౌస్‌ ఆడిటింగ్‌‌‌‌‌‌‌‌ కంపెనీ ప్రమేయం ఉన్నట్టుతేలడంతో దీనిని ప్రభుత్వం డీబార్‌‌‌‌‌‌‌‌ చేసింది. సత్యంకుంభకోణం బయటపడ్డ తొమ్మిదేళ్ల తరువాత, అంటే2018 జనవరిలో ప్రైస్‌ వాటర్‌‌‌‌‌‌‌‌హౌస్‌ లిస్టెడ్‌‌‌‌‌‌‌‌ కంపెనీలకు, మార్కెట్‌ దళారులకు రెండేళ్లపాటు ఆడిట్‌ సేవలుఅందించకుండా సెబీ డీబార్ చేసింది. దీనికి సంబంధించిన రెండు భాగస్వామ్య సంస్థలపై మూడేళ్ల పాటునిషేధం విధించింది. రూ.13 కోట్లు జరిమానా చెల్లించాలని ప్రైస్‌ వాటర్‌‌‌‌‌‌‌‌హౌస్‌ తోపాటు దీనిలో పనిచేసిన ఇద్దరు ఆడిటర్లు గోపాలకృష్ణన్‌, తాళ్లూరి శ్రీనివాస్‌ నుఆదేశించింది. లిస్టెడ్‌‌‌‌‌‌‌‌ కంపెనీలుగానీ, దళారులు గానీ ఈ కంపెనీ నుంచి ఎలాంటి సేవలూ పొందకూడదని స్పష్టం చేసింది. ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ఫ్రాడ్యులెంట్‌ అండ్‌‌‌‌‌‌‌‌ అన్‌ ఫెయిర్‌‌‌‌‌‌‌‌ ట్రేడ్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీసె స్‌ (ఎఫ్‌ యూటీపీ) కింద నిం-దితులపై అభియోగాలు మోపింది. సత్యం కంపెనీకి డెలాయిట్‌ కూడా కొన్నాళ్లపాటు ఆడిటింగ్‌‌‌‌‌‌‌‌ సేవలుఅందించింది.

చాలా సంస్థలకు మేం ఆడిటింగ్‌‌‌‌‌‌‌‌ చేయలేదు
ఐఎల్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌ ఎస్‌ కుంభకోణంలో డెలాయిట్‌ పాత్రపై అడిగిన ప్రశ్నకు కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ ‘‘ఐఎల్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌ఎస్ దివాలా తీయడంపై విచారణ జరుగుతోంది. మా వంతుగా మేం పూర్తిగా సహకరిస్తున్నాం. ఆడిటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రమాణాలు, చట్టాలు, నియంత్రణలప్రకారమే మేం ఆడిటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించాం’’ అనివివరణ ఇచ్చారు. కంపెనీ మరో వాదన ఏమిటంటే..ఐఎల్‌‌‌‌‌‌‌ఎఫ్‌ఎస్‌ దివాలా గత మేలో మొదలయింది.ఇందులోని కీలక విభాగాలు ఐఎల్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌ఎస్‌ , ఐటీఎన్‌ఎల్‌‌‌‌‌‌‌‌, ఐఎఫ్‌ఐఎన్‌ . 2017, 2018 ఆర్థిక సంవత్సరాల్లోఐఎల్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌ ఎస్‌, ఐటీఎన్‌ఎల్‌‌‌‌‌‌‌‌ సంస్థల ఆడిటింగ్‌‌‌‌‌‌‌‌నుఎస్‌ ఆర్‌‌‌‌‌‌‌‌బీసి అండ్‌‌‌‌‌‌‌‌ కంపెనీ నిర్వహించింది. 2018లోఐఎఫ్‌ ఐఎన్‌ ను బీఎస్‌ఆర్ (కే పీఎంజీ)తోపాటుడెలాయిట్‌ , బీఎస్ఆర్‌‌‌‌‌‌‌‌ (కేపీఎంజీ) ఆడిట్‌ చేశాయి.

2016లోనూ ఐఎల్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌ ఎస్‌ , ఐటీఎన్‌ ఎల్‌‌‌‌‌‌‌‌ ఖాతాలనుఎస్‌ ఆర్‌‌‌‌‌‌‌‌బీసీతో కలిసి డెలాయిట్‌ ఆడిట్‌ చేసింది. ఐఎఫ్‌ ఐఎన్‌ సొంతగా ఖాతాలను ఆడిట్‌ చేయించుకుంది. అయితే 2015 వరకు చాలా ఏళ్లపాటు డెలాయిట్‌ఈ మూడు గ్రూపుల ఖాతాలను ఆడిట్‌ చేసింది. ఐఎల్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌ ఎస్‌ కు మొత్తం 347 సబ్సి డరీలు ఉన్నాయని,వీటిలో చాలా సబ్సిడరీల ఖాతాలను చిన్న కంపెనీలుఆడిట్‌ చేశాయని డెలాయిట్‌ తెలిపింది. తాముఆడిటింగ్‌‌‌‌‌‌‌‌ జరిపినప్పుడు లోన్లకు సరిపడిన మొత్తంతనఖా పెట్టా రని, వీటిని నైట్‌ ఫ్రాం క్‌ , ఎన్‌ ఎం రాయ్‌ జీవంటి ప్రముఖ సంస్థలు లెక్కగట్టాయని డెలాయిట్‌పేర్కొం ది. 2015 ఆర్థిక సంవత్సరంలో పిరమల్గ్రూపు షేరుకు రూ.750 చొప్పున చెల్లించి వాటాకొంటా మనే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.ఇందుకు తిరస్కరించిన ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ రూ.1,100 చొప్పునచెల్లించాలని కోరిందని డెలాయిట్‌ తెలిపింది.

Latest Updates