కేసీఆర్ చర్చలు పెడితేనే ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియలు

సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో చర్చలు ప్రారంభిస్తేనే… కరీంనగర్ లో డ్రైవర్ బాబు అంతిమయాత్ర ప్రారంభిస్తామని చెప్పారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. క్యాంప్ ఆఫీస్ లో కుక్క చనిపోతే స్పందించే కేసీఆర్… ఇంతమంది కార్మికులు చనిపోతే స్పదించరా అని ప్రశ్నించారు. మాట్లాడుకుంటే యుద్ధాలే పరిష్కారమవుతాయని అన్నారు మందకృష్ణ.

డబ్బులు ఇచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందనీ.. అయితే .. కార్మికులు మాత్రం లొంగిపోలేదని అన్నారు జేఏసీ నేత రాజారావు.  ప్రభుత్వం చర్చలు ప్రారంభించేదాకా అంతిమ యాత్ర నిర్వహించేది లేదని నేతలు, ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతున్నారు. బాబు చనిపోయి 24 గంటలైనా సీఎం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. బాబు మరణంతో కరీంనగర్ లో ఉద్రిక్తత కొనసాగుతుంది.

Latest Updates