11 మంది సర్కారీ డాక్టర్లకు డెంగీ

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌
జీఎంసీహెచ్‌లో పరిస్థితి

ఔరంగాబాద్‌: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ (జీఎంసీహెచ్‌)కు చెందిన 11 మంది డాక్టర్లకు డెంగీ పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ జ్వరాలు పెరుగుతున్నాయని, పోయిన నెలలో ఏడుగురు ఈ వ్యాధితో చనిపోయారని తెలిపారు. 11 మంది డాక్టర్లలో ఐదుగురిని డిశ్చార్జ్‌ చేశామని, నలుగురుకి ఐసీయూలో, మిగతా వారికి సాధారణ వార్డుల్లో ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నామని సూపరింటెండెంట్‌ కైలాశ్‌ జీని చెప్పారు.

ఔరంగబాద్‌ పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త విపరీతంగా పేరుకుపోయిందని, దాని వల్ల దోమలు ఎక్కువగా వస్తున్నాయని జీఎమ్‌సీహెచ్‌ డీన్‌ కనన్‌ ఎలికర్‌‌ చెప్పారు. డెంగీ రావడానికి అది కూడా కారణమని అన్నారు.

Latest Updates