అమరచింతలో 8 మందికి డెంగీ

  • రెండ్రోజుల క్రితం ఇద్దరు చిన్నారులు మృతి
  • పట్టణంలో పర్యటించిన కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా
  • నిల్వ నీటిని పారబోయించాలని ఆఫీసర్లకు ఆదేశం

కరోనా వైరస్‌తోనే జనాలు వణికిపోతుంటే అమరచింత మున్సిపాలిటీలో డెంగీ వ్యాధి ప్రబలింది. రెండ్రోజుల క్రితమే ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. గురువారం మరో 8 మందికి వచ్చింది. విషయం తెలుసుకున్న వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా డెంగీ నమోదైన వార్డుల్లో నిల్వ ఉంచిన నీటిని గమనించిన ఆమె వెంటనే పారబోయించారు. అనంతరం కలెక్టర్‌‌ మాట్లాడుతూ డాక్టర్ల పరీక్షల ఆనంతరం అమరచింత పట్టణంలో డెంగీ ఉన్నట్లు నిర్ధారణకు వచ్చామని తెలిపారు. డెంగ్యూ బారిన పడి చనిపోయిన వార్డులో సర్వేనిర్వహించి 8 మంది డెంగ్యూ రోగులను వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని చెప్పా రు. పట్టణంలోని అన్ని ఇళ్లను సర్వే నిర్వహిస్తున్నామని , డెంగీ వ్యాధి రాకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాధి నివారణకు డీఆర్వో, డీపీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ వో డాక్టర్ శ్రీనివాసులు, డీఆర్వోడీ గణేష్, డీపీవో రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ మోహన్, తహసీల్దార్ ఎండీ నదీమ్ అహ్మద్ ఉన్నారు.

Latest Updates