
చికెన్ వడ్డించలేదన్న కారణంగా కోపంతో ధాబా కు నిప్పంటించారు ఇద్దరు మందుబాబులు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిందీ సంఘటన. శంకర్ టేడే(29), సాగర్ పటేల్ (19) అనే ఇద్దరు వ్యక్తులు పీకల దాకా మద్యం తాగి అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బెల్టరోడి ప్రాంతంలోని ధాబాకు వచ్చారు. తమకు చికెన్ వడ్డించమని కోరగా, ధాబా యజమాని అందుకు నిరాకరించాడు. దీంతో కోపంతో ఆ ఇద్దరు ధాబాకు నిప్పంటించి పారిపోయారు. పోలీసులు వెంటనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.