జాగ్వార్ కారు కోసం BMWను కాల్వలో తోసేశాడు

denied-jaguar-haryana-man-pushes-new-bmw-into-river-in-anger

తండ్రిని జాగ్వార్ కారు కొనివ్వమని అడిగితే BMW కారు కొనిచ్చాడన్న కోపంతో.. ఓ తనయుడు కొత్తకారును నదిలో తోసేశాడు. ఈ ఘటన హర్యానాలో జరిగింది. యుమునానగర్‌ కు చెందిన ఓ యువకుడు తన తండ్రిని జాగ్వార్ కారు కొనివ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఆ తండ్రి జాగ్వార్ బదులు బీఎండబ్ల్యూ కారు కొనిచ్చాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ యువకుడు… ‘HR O2 7777’ నంబరు గల BMW కారు తీసుకుని యమునా కాలువ దగ్గరికొచ్చాడు. ఆ కారును యమునా నది కాల్వలో తోసేసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. నదిలో కొంతదూరం కొట్టుకెళ్లిన కారు ఆ తర్వాత మధ్యలో చిక్కుకుపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… ఎన్​​డీఆర్​ఎఫ్ సాయంతో దాదాపు ఐదు గంటలు శ్రమించి కారును బయటకు తీశారు. ఈ కొత్త బీఎండబ్ల్యూ కార్ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని అంచనా. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

కారును కాల్వలో తోసే ముందు ఫోన్​లో మాట్లాడుతూ… “నేను ఇంతకంటే పెద్ద కారు కొంటాను.. కోటిన్నర రూపాయలు ఖరీదైన కారు కొంటాను” అని సవాలు చేసినట్లు ప్రత్యక్షంగా చూసిన వాళ్లు పోలీసులకు తెలిపారు.

Latest Updates