డెన్మార్క్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు శ్రీకాంత్

కరోనా వైరస్‌ కారణంగా నిలిచిపోయి…ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన డెన్మార్క్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ పోరులో కిదాంబి శ్రీకాంత్‌ దూసుకెళ్తున్నాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో కెనడా ఆటగాడు జేసన్‌ ఆంథోనీపై 21-15, 21-14 తేడాతో ఘన విజయం సాధించాడు. కేవలం 33 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఈ విక్టరీతో మొదటి క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరాడు.

రెండో మ్యాచ్‌లో తలపడే సెకండ్‌ సీడ్‌ చౌటీన్‌ చెన్‌, నాట్‌ గెయెన్‌ల మధ్య ఎవరు గెలిస్తే వారితో శ్రీకాంత్‌ శుక్రవారం మొదటి క్వార్టర్‌ ఫైనల్‌ ఆడనున్నాడు.

Latest Updates