నేటి నుంచి డెన్మార్క్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ : సింధు, సైనాపైనే దృష్టి!  

ఒడెన్స్‌‌‌‌: ఈ సీజన్‌‌‌‌లో అందని ద్రాక్షగా మారిన బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ కోసం వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ పీవీ సింధు.. మరోసారి వేట మొదలుపెడుతున్నది. మంగళవారం నుంచి జరిగే డెన్మార్క్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. తొలి రౌండ్‌‌‌‌లో జార్జియా మరిస్కా (ఇండోనేసియా)తో ఆమె తలపడుతుంది. మరోవైపు ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌‌‌‌ సైనా.. అనారోగ్యం కారణంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోంటోంది. ప్రస్తుతం పెద్దగా ఫామ్‌‌‌‌లో లేని సైనా.. తొలి రౌండ్‌‌‌‌లో ప్రపంచ 12వ ర్యాంకర్‌‌‌‌ సయాకా తకహషి (జపాన్‌‌‌‌)తో పోటీపడుతుంది.

ఇక పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్‌‌‌‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మోకాలి గాయం కారణంగా చైనా, కొరియా ఓపెన్‌‌‌‌కు దూరంగా ఉన్న శ్రీ.. ఈ టోర్నీలో సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఓపెనింగ్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో అండెర్స్‌‌‌‌ అంటోన్‌‌‌‌సెన్‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ప్రణీత్‌‌‌‌.. లెజెండ్‌‌‌‌ లిన్‌‌‌‌ డాన్‌‌‌‌ను ఎదుర్కొనున్నాడు.

Latest Updates