పెళ్లి వాయిదా వేసుకున్న డెన్మార్క్ ప్రధాని

యురోపియన్ యూనియన్  (ఈయూ) సమ్మిట్ కారణంగా డెన్మార్క్  ప్రధాని తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ‘‘వచ్చే నెల బ్రస్సెల్స్ లో ఈయూ కౌన్సిల్ సమ్మిట్ జరగనుంది.అదే నెల నా పెళ్లి ఉంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మ్యారేజ్ వాయిదా వేసుకున్నా” అని డెన్మార్క్ పీఎం ఫ్రెడెరిక్సన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఆమె పెళ్లి వాయిదా పడటం ఇది రెండోసారి. గత ఏడాది నేషనల్ ఎలక్షన్స్ కారణంగా పెళ్లి వాయిదా వేసుకున్నారు. ఫ్రెడరిక్సన్ తన ఫియాన్సీ బో టెంగ్ బర్గ్ ను 2014లో కలిశారు. 2017లో ఎంగేజ్ మెంట్ జరిగింది.

Latest Updates