మందుతో రవాణా శాఖకు మస్త్ ఇన్​కం

రవాణా శాఖకు అధిక ఇన్​కం
మద్యం తాగిన వారిపై ఎక్కువ ఫిర్యాదులు
ఓవర్ లోడ్ పై భారీ జరిమానా.. కొత్త చట్టం అమలు
వికారాబాద్ జిల్లా రవాణా అధికారి నెల్లురి వాణి

వికారాబాద్ జిల్లా, వెలుగు: జిల్లా రవాణా శాఖకు మూడు నెలల్లో  రూ.10.43 కోట్ల రాబడి వచ్చిందని రవాణా శాఖ జిల్లా అధికారి నెల్లురి వాణి తెలిపారు. 15 సర్వీసుల ద్వారా రవాణా శాఖకు రాబడి వచ్చినట్లు వివరించారు. అందులో సర్వీస్ చార్జి పన్ను వాహనాలపై వేసిన జరిమానాలు ఇతర రిపోర్టులపై ఆధాయ వచ్చినట్లు తెలియజేశారు. మద్యం తాగి వాహనాలు అతి వేగంగా నడుపుతునట్టు ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని, దీని కోసం  డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.

వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో ఓవర్ లోడ్ లారీలు అధికంగా తిరుగుతున్నట్లు సమాచారం ఉందని, రవాణా శాఖ కొత్త చట్టం ప్రకారం ఒక్క లారీ పై 20 వేల జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. పరిగి నియోజక వర్గంలో ఓవర్ లోడ్ తో వెళ్తున్న నాలుగు స్కూల్ బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. గుర్తింపు లేని పాఠశాలల బస్సుల అనుమతి ఇవ్వలేదన్నారు.

Latest Updates