బాగోగులు చూస్తలేరని వృద్ధ దంపతుల ఆత్మహత్య

నర్సంపేట, వెలుగు: బాగోగులు చూసేవారు లేక మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ రూర‌ల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ లో ఓ ఇంట్లో తొగరుఎల్లమ్మ(60), అల్లూరు(65)దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉండగా వారికి వివాహాలై వేర్వేరు చోట్ల కాపురం చేస్తున్నారు. అల్లూరు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఎల్లమ్మ కూలీ నాలీ చేస్తూ వెళ్లదీస్తోంది. ఇటీవల అల్లూరు నడవలేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యారు. కొడుకులెవరూ చూడడానికి రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన వృద్ధదంపతులు ఇంట్లో ఉన్న మోనో మందు తాగి చనిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates