రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన డిప్యూటీ ఎమ్మార్వో జయలక్ష్మి

నాగర్ కర్నూలు జిల్లా: లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు తాడూరు మండలం డిప్యూటీ తహసీల్దార్ జయలక్ష్మి. జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో సి బ్లాక్ లో ఇంచార్జ్ సూపర్డెంట్ గా విధులు నిర్వహిస్తున్న జయలక్ష్మి…. తిమ్మాజీపేట మండలం మారేపల్లి గ్రామంలో ఓ వివాదంలో ఉన్న భూమి విషయంలో వెంకటయ్య అనే వ్యక్తి నుంచి  పట్ట మార్పిడి కై 13 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో వెంకటయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. డిప్యూటీ ఎమ్మార్వో పై ఫిర్యాదు చేశాడు. ఈ రోజు సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో జయలక్ష్మి.. వెంకటయ్య వద్ద  లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Latest Updates