సుజనా చౌదరితో భేటీ అయిన కిషన్‌రెడ్డి

  • ఏపీ రాజకీయ వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం

హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో భేటీ అయ్యారు. ఆయన ఇంటికి వెళ్లిన కిషన్‌రెడ్డి ఏపీ రాజకీయ వ్యవహారాలపై సుజనాతో చర్చించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై ఏపీ బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో దానిపై చర్చించేందుకు ఇద్దరు భేటీ అయ్యారు.ఈ విషయంపై బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇద్దరి నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకంగానే సుజనా చౌదరిని కలిశారని ఆయన కార్యాలయం ప్రకటించింది. రాజధాని వికేంద్రీకరణకు బీజేపీ వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రకటించారు. మూడు రాజధానులకు అభ్యంతరం లేదంటూ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. రాజధానిని నిర్ణయించాల్సింది కేంద్రం అని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ప్రకటించారు. ఇది రాష్ట్ర పరిధిలోని అంశం అని మరో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ అన్నారు.

Latest Updates