డేరా బాబాకు జీవిత ఖైదు.. రూ.31 లక్షల జరిమానా

డేరా బాబాకు జీవిత ఖైదు.. రూ.31 లక్షల జరిమానా

శిష్యురాళ్లను అత్యాచారం చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌ సింగ్ (డేరా బాబా) మరో కేసులో దోషిగా తేలాడు. తన శిష్యుడు, మేనేజర్ రంజిత్ సింగ్ మర్డర్‌‌ కేసులో డేరా బాబాతో పాటు మరో ఐదుగురిని దోషులుగా తేలుస్తూ పంచకుల సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఐదుగురికీ జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. అలాగే డేరా బాబాకు రూ.31 లక్షల జరిమానా విధించింది. మిగిలిన నలుగురికీ రూ.50 వేల చొప్పున జరిమానా వేసింది.

డేరా బాబా తన శిష్యుడైన రంజిత్ సింగ్‌ను 2002 జులై 10న మరో ఐదుగురితో కలిసి హత్య చేశారు. దీనిపై రంజిత్ సింగ్ కొడుకు జగ్సీర్‌‌ సింగ్ కంప్లైంట్ చేయడంతో పోలీసు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు 2003 డిసెంబర్‌‌ 3న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు మొదలు పెట్టింది. హర్యానాలోని పంచకులలో ఉన్న సీబీఐ స్పెషల్ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. సుదీర్ఘ విచారణ తర్వాత ఇవాళ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. అయితే ఈ కేసును మరింత సాగదీసేందుకు గత వారంలో కొందరు ప్రయత్నించారు. ఈ కేసును పంచకుల కోర్టు నుంచి రాష్ట్రంలోని మరేదైనా సీబీఐ కోర్టుకు మార్చాల్సిందిగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే అటువంటి అవసరమేమీ లేదని హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ అడ్డంకులు తొలగడంతో పది రోజుల క్రితమే పంచకుల కోర్టు తీర్పు వెలువరించింది. డేరా బాబాతో పాటు మరో ఐదుగురిని సెక్షన్ 302 కింద దోషులుగా తేల్చింది. ఈ కేసులో శిక్షన కోర్టు ఇవాళ వెల్లడించింది.

అయితే డేరా బాబా ఇప్పటికే రెండు కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తన ఆశ్రమంలో శిష్యులుగా ఉన్న ఇద్దరు మహిళలను రేప్ చేసిన కేసులో 2017 ఆగస్టులో పంచకుల సీబీఐ కోర్టు డేరా బాబాను దోషిగా తేల్చి 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అలాగే డేరా బాబా తన ఆశ్రమంలో చేస్తున్న అరాచకాలు, మహిళలపై చేస్తున్న అఘాయిత్యాలపై వార్త కథనాలు రాసిన జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతిని చంపిన కేసులోనూ దోషిగా తేలుస్తూ 2019లో కోర్టు తీర్పు ఇచ్చింది.

మరిన్ని వార్తల కోసం..

కాళేశ్వరం అవినీతి సొమ్ముతో హుజూరాబాద్ ఉప ఎన్నికలు

TRS పార్టీలో  చేరిన మోత్కుపల్లి నర్సింహులు

రైతు నిరసనలతో నిలిచిపోయిన 160 రైళ్లు