దేశాన్ని తలవంచనీయను.. ఏమైంది మోడీ హామీ?

న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఓ గ్రామాన్ని కట్టిందన్న వార్తల నేపథ్యంలో మోడీని విమర్శిస్తూ రాహుల్ కామెంట్స్ చేశారు. దేశాన్ని తలవంచనివ్వబోమన్న మోడీ హామీ ఏమైందంటూ ప్రశ్నించారు.

రాహుల్‌‌తోపాటు కాంగ్రెస్ సీనియర్ రణ్‌‌దీప్ సింగ్ సూర్జేవాలా కూడా మోడీపై విమర్శలకు దిగారు. మోడీజీ మీ 56 అంగుళాల ఛాతీ ఏమైంది అంటూ సూర్జేవాలా క్వశ్చన్ చేశారు. ఈ ట్వీట్‌‌కు అరుణాచల్‌‌లో చైనా నిర్మాణాలు చేసిందన్న ఆర్టికల్‌‌ను జత చేశారు. ఇండియా-చైనా బార్డర్ అయిన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌‌ఏసీ) దాదాపుగా 3,488 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. అరుణాచల్ ప్రదేశ్ సౌతర్న్ టిబెట్‌‌లో భాగమని, ఆ ప్రాంతం తమ పరిధిలోకే వస్తుందని చైనా వాదిస్తోంది. మరోవైపు గత ఎనిమిది నెలలుగా ఈస్టర్న్ లడఖ్‌‌లో ఇరు దేశాల మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. పలు దఫాల చర్చలతో సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పటికీ అవి సఫలం కాలేదు.

Latest Updates