నవ్వు ఆపుకోలేరు : అండర్19 భారత్‌ – పాక్ మ్యాచ్ పై ఫన్నీ మీమ్స్ (వీడియో)

అండర్ -19 భారత్ – పాక్ మ్యాచ్ పై  ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండర్ -19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ – పాకిస్థాన్‌ని చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కేవలం 172 పరుగులకే 43.1 ఓవర్లలో పాకిస్థాన్‌ను అలౌట్ చేసింది. 173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లోని ఓ ఓవర్ పై మీమ్స్ క్రియేటర్స్ తన క్రియేటీవిటీని బయటపెడుతున్నారు.

టీమిండియా బౌలర్ రవి బిష్ణోయ్ 31వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. స్ట్రైకింగ్ లో పాక్ బ్యాట్స్ మెన్  అక్రమ్, నాన్ స్ట్రైక్ లో  కెప్టెన్  రోహైల్ నజీర్ ఉన్నాడు. అయితే రవి బిష్ణోయ్ బౌలింగ్ లో రన్ కోసం ప్రయత్నించిన అక్రమ్, నజీర్ లు కన్ఫ్యూజ్ అయ్యారు.

స్ట్రైకింగ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ నాన్ స్ట్రైక్ లో..నాన్ స్ట్రైక్ లో ఉన్న బ్యాట్స్ మెన్ స్ట్రైకింగ్ లోకి రావాల్సి ఉంది. కానీ అలా కాకుండా ఇద్దరు బ్యాట్స్ మెన్లు స్ట్రైకింగ్ వైపు వెళ్లగా భారత బౌలర్లు స్టంప్ అవుట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాక్ బ్యాట్స్ మెన్లను కోట్ చేస్తూ ట్వీట్

పాక్ ఆటగాళ్ల కన్ఫ్యూజన్ పై క్రికెట్ వరల్డ్ కప్ ట్వీట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీట్ షేర్ అయ్యింది. ఆ ట్వీట్ లో ఫ్యూచర్ స్టార్స్ అంటూ తలబాదుకుంటున్న మీమ్స్ ఉన్నాయి. ఆ ట్వీట్ పై రియాక్ట్ అయిన నెటిజన్లు తమదైన స్టైల్లో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేశారు.

డీసెంట్ బాయ్ మీమ్స్

స్థిరత్వం అంటే ఏంటో ఈ ఫోటోను చూపించండి అంటూ పాక్ ఆటగాళ్లు టెస్టుల్లో, వన్డేలు, టీ20ల్లో ఎలా కన్ఫ్యూజ్ అయ్యారో చూడండి అంటూ డీసెంట్ బాయ్ ట్వీట్టర్  అకౌంట్ నుంచి ఓ ట్వీట్ షేర్ అయ్యింది.

పాక్ సీనియర్ టీం, పాక్ జూనియర్ టీం ను ఫాలో అవుతున్న  మీమ్స్

పాక్ జూనియర్ టీం.. పాక్ సీనియర్ టీం ను కాపీ చేస్తున్నట్లు ఓ మీమ్స్ వైరల్ అయ్యింది.

Latest Updates