కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా
  • అసెంబ్లీలో బల పరీక్ష పెట్టాలి  
  • పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్

చండీఘడ్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు. ప్రస్తుతానికి  ఏ పార్టీలో చేరబోవటం లేదని, బిజేపీలో కూడా చేరండం లేదన్నారు. నిన్న అమిత్ షా సమావేశంలో రాజకీయ అంశాలపై చర్చకు రాలేదన్నారు. అజిత్ దోవల్ తో కేవలం భద్రతా పరమైన అంశాలపైనే చర్చకు వచ్చిందన్నారు. 
కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగింది
కాంగ్రెస్ పార్టీ తనకు అవమానం జరిగిందని, సిద్దూ వల్లే నేను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానని మాజీ సీఎం అమరీందర్ సింగ్ వెల్లడించారు. నా మద్దతుదారులైన ఎమ్మేల్యేలతో అసెంబ్లీలో బల నిరూపణకు వెళ్తానని ఆయన ప్రకటించారు. పంజాబ్ ప్రభుత్వంపై బలనిరూపణ పెట్టాలని అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. బలనిరూపణ తర్వాత తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తన మద్దతు దారులతో ఈ రోజు గవర్నర్ ని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.