బెంగళూరులో త్వరలో డిటెన్షన్‌‌ సెంటర్‌‌‌‌

బెంగళూరు: మన దేశంలోకి అక్రమంగా వచ్చే ఫారినర్స్‌‌ కోసం త్వరలో బెంగళూరులో డిటెన్షన్‌‌ సెంటర్‌‌‌‌ ఏర్పాటు చేయనున్నట్లు బెంగళూరు డిస్ట్రిక్‌‌ పోలీస్‌‌ అధికారి చెప్పారు. బెంగళూరులోని నీలమంగళ ఏరియాలోని స్టేట్‌‌ రన్‌‌ హాస్టల్‌‌ను డిటెన్షన్‌‌ సెంటర్‌‌‌‌గా మారుస్తామన్నారు. సౌత్‌‌ ఇండియాలో ఇదే మొదటిదని, దేవనహళ్లిలోని బెంగళూరు ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌కు ఇది దగ్గరగా ఉంటుందని పోలీసులన్నారు. బెంగళూరులోని బంగ్లాదేశీయులను గుర్తించేందుకు ఎన్‌‌ఆర్‌‌‌‌సీ తీసుకురావాలని కర్నాటక మంత్రి బొమ్మాయి అన్న నేపథ్యంలో ఈ డిటెన్షన్‌‌ సెంటర్‌‌‌‌ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

 

Latest Updates